దక్షిణాది రీమేక్ సినిమాలు కాసుల వర్శం కురిపించినా బాలీవుడ్ కి దక్షిణాది సినిమాలంటే ఒకరకమైన చులకన భావమే ఉండేది. కానీ రాజమౌళి బాహుబలి వల్ల దక్షిణాది చిత్రాలపై ఉత్తరాది వాళ్లకి చిన్నచూపు పోవటమే కాకుండా భారతీయ చలన చిత్రంలో ఇప్పటివరకు ఆధిపత్యం చెలాయిస్తున్న బాలీవుడ్ ను వెనకకు నెట్టి దక్షిణాది చిత్రాలు శాసిస్తున్నాయి . ఒకే ఒక్క దెబ్బ బలంగా పడింది మన సినిమాల కోసం ఇప్పుడు ఉత్తర భారత దేశం కూడా ఎదురు చూస్తోంది. నార్తిండియన్ ప్రేక్షకులకి కూడా బాలీవుడ్ ఇతివృత్తాలన్నీ బోర్ కొట్టాయి. డిఫరెంట్ గా ఉండే కథలూ, సరికొత్త బాడీ లాంగ్వేజ్ ఉన్న హీరోలకోసం ఉత్తరాది ప్రజలు ఎదురు చూస్తున్నారు.
అందుకే ఇప్పుడు తమిళ, తెలుగు ఇండస్ట్రీ నిర్మాతలూ, దర్శకులూ ఏమాత్రం ఖర్చు వెనుకాడటం లేదు. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న రోబో సీక్వెల్ ఖర్చు నాలుగొందల కోట్లు దాటిపోయిందని అంచనా. రెండు వందల కోట్ల బడ్జెట్‌లో తీద్దామని అనుకున్న ఈ చిత్రం ఇప్పుడు డబుల్ అయిపోయినా నిర్మాతలు ఏమాత్రం భయపడడం లేదు.
ఈ చిత్రానికి వస్తోన్న బిజినెస్ ఆఫర్లు చూస్తే విడుదలకి ముందే కనీసం ఆరు వందల కోట్లు చేతిలోకి వచ్చేలాగుంది. కేవలం శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారానే 171 కోట్లు వస్తున్నాయంటే దీనిపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయో తెలుస్తోంది. తెలుగు వెర్షన్ రైట్స్
రాజమౌళి కి ఎదురుదెబ్బ….. బాహుబలి ని క్రాస్ చేసిన రోబో 2.0
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి