నింద వేరూ నిజం వేరు
ఎవరు ఏమన్నా వాస్తవాలు నమ్మి తీరాలి
కాలం తీర్పు కోరి వేచి చూడడం కన్నా
ఓ ప్రయత్నం అన్నది నిజాల వెల్లడిలో చేస్తూనే ఉండాలి
రేణూ దేశాయ్ చేస్తున్నదిదే! తానేంటో వెల్లడిస్తున్నదీ ఇందుకే!!
మరికొంత … చదవండిక
నన్ను నమ్మండి ప్లీజ్ అని వేడుకుంటోంది ఒకనాటి కథానాయిక, పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్. ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు సంచలనం కావడంతో అటుపై ఆమె వరుసగా స్పందిస్తూ వస్తున్నారు. అభిమానులు కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తన భావాలను వెల్లడిస్తూ ఏది తప్పు ఏది ఒప్పు అన్నది తెల్సుకోవాలని విన్నవిస్తున్నారు. వాస్తవానికి పవన్ నుంచి విడిపోయినపుడు ఆయన నుంచి భరణం రూపంలో పెద్ద మొత్తం అందినట్లు ప్రచారంలోఉన్న మాటల్లో వాస్తవం లేదని తేల్చేశారా మె. ఇవాళ ఆమె ఓ దర్శకురాలిగా, నిర్మాతగా ఉందీ అంటే అందుకు కారణం పవన్ నుంచి అందుకున్న డబ్బే అని అనుకోవడం అర్ధరహితమని చెప్పారీమె.తాను పవన్ వద్ద తీసుకున్న డబ్బులతోనే సినిమాలు నిర్మించాననే ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేశారామె.ఆమాటకొస్తే, పవన్ తో తాను ఎప్పుడూ డబ్బుల ప్రస్తావనే తీసుకురాలేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి వచ్చినందున ఆ డబ్బుతోనే సినిమాలు నిర్మించానని తెలిపారు.