రికార్డుల వేట‌లో ప‌ద్మావ‌తి

సంజ‌య్ లీలా బ‌న్సాలీ రూపొందిస్తున్న న‌యా చిత్రం ప‌ద్మావ‌తి స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది. డిజిట‌ల్ మీడియాలో విడుద‌లైన ట్రైల‌ర్ మ‌రో విజువ‌ల్ వండ‌ర్ ని త‌ల‌పిస్తోంది. దీంతో  ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్‌లో రెండు కోట్ల 14 లక్షల మందికి పైగా వీక్షించ‌డం విశేషం. ఈ సినిమా దీపికా న‌టనే హైలెట్ గా నిల‌వనుంద‌ని టాక్‌. అంతేకాదు ఇప్ప‌టికే బాజీరావ్ మ‌స్తానీతో వ‌చ్చిన పేరుకి ఇది కొన‌సాగింపు నివ్వ‌డం ఖాయం.ఆమె ఆహార్యం..న‌ట‌న ఆ రెండూ  సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లు కానున్నాయి.

ట్రైల‌ర్ విడుద‌లైన ఒక్క రోజులోనే మూడు లక్షల 95 వేల లైక్‌లు వచ్చాయి. ‘బాహుబలి2’(హిందీ) లాగే ఈ స్థాయిలో రికార్డు సృష్టించిన చిత్రం ‘పద్మావతి’ కావడం విశేషం. సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.ఇందులో దీపిక టైటిల్‌ పాత్రలో, రణ్‌వీర్‌ సింగ్‌ సుల్తాన్‌ అల్లాఉద్దీన్‌ ఖిల్జి పాత్రలో, షాహిద్‌ కపూర్‌ మహారావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి గానూ నిర్మాత, దర్శకుడు సంజయ్‌ భన్సాలీ, షాహిద్‌కి, రణ్‌వీర్‌కి రూ.10 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ దీపిక మాత్రం వారి కంటే ఎక్కువగా రూ.13 కోట్ల పారితోషికం అందుకుందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనేకానేక అంచ‌నాలతో వ‌స్తోన్న ఈ చిత్రం విజ‌యం సాధించాల‌ని , మ‌రో చ‌రిత్ర‌కు నాంది ప‌ల‌కాల‌ని ఆశిద్దాం.

Leave a comment