నిన్నటి నీకోసం మొదలుకొని నేటి రాజా ది గ్రేట్ వరకూ అతడే గ్రేట్. ఎందరికో లైఫ్ ఇచ్చాడు. శ్రీను వైట్ల మొదలుకొని పూరీ దాకా అంతా అప్పటికి కొత్తవారే కదా! తన సినిమాతో ఎదిగారు. తన సినిమాతోనే నిరూపించుకున్నారు.అందుకే కొత్తవారంటేనే తనకు ఇష్టం అని మరో సారి చెప్పాడు రవితేజ.‘‘కొత్తవాళ్లతో పనిచేయడమంటే ఇష్టం. నేనూ ఒకప్పుడు కొత్తవాడినే, ఒకరు ప్రోత్సహించడంతోనే ఇక్కడిదాకా వచ్చా. హిట్టు వచ్చింది కాబట్టి గొప్పోడు, ఫ్లాపు వచ్చిందంటే కాదని లెక్కలు వేసుకోవడం నాకు మొదట్నుంచీ అలవాటు లేదు. దర్శకుల్ని నమ్ముతా. వాళ్లవల్లే నేనీ స్థాయికి వచ్చా.
నాపై జయాపజయాల ప్రభావం చాలా తక్కువ. ఫలితం గురించి ఆలోచించకుండా తర్వాతేంటి? అనే విషయంపైనే దృష్టి పెడుతుంటా’’అని వివరించాడు. రాజా ది గ్రేట్ ఈ దీపావళికి విడుదలవుతున్నందున భలే హుషారుగా ఉన్నాడు. గత కొద్దికాలంగా నెలకొన్న సమస్యలన్నీ సమసిపోయేలా ఈ సినిమా సక్సెస్ తన కెరియర్‌కో కిక్ స్టార్టింగ్ పాయింట్ కానుందని చెప్పాడు. పటాస్ ఫేం అనీల్ రూపొందించిన విధానం అంత బాగుందని కితాబిచ్చాడు.