వర్మ ఆ.. ఎమ్మెల్యేని ఏ రేంజ్ లో ఆడుకున్నాడో మీరే చూడండి…

ఇంకా సినిమా ప్రారంభం కాలేదు

స్క్రిప్ట్ ఏంటో తెలియ‌దు..

క‌థ క‌థ‌నం ఏ మేర‌కు వివాదాల‌కు అతీత‌మో అన్న‌ది స్ప‌ష్ట‌త లేదు

ఇవేవీ లేకున్నా వ‌ర్మ‌పై ఓ రేంజ్‌లో మాట‌ల యుద్ధం ప్ర‌క‌టిస్తున్నారు టీడీపీ నేత‌లు

ఇందుకు అనుగుణంగానే సోష‌ల్ మీడియా ద్వారా కౌంట‌ర్ ఎటాక్ ఇస్తున్నాడు ఆర్జీవీ

తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి నా రిప్లై అంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు వ‌ర్మ‌

ఈ పోస్టు ఇప్పుడు  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వ‌ర్మ‌ని ఓ సైకో అంటూ.. సినిమా తీయాలంటే అన్ని రాజ‌కీయ ప‌క్షాలనూ పిలిచి మాట్లాడాలంటూ ప్ర‌భాక‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఘాటుగానే స‌మాధానమిచ్చాడు.ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వెనుక వైసీపీ హస్తం ఉంది అన్న ఆరోప‌ణ‌కు ఆ..హస్తం వెనక మీ హస్తం ఉందా సార్? లేకపోతే మీకెలా తెలుసు ఎవరి వెనుక ఎవరున్నారో ? అయినా ముందు వెనకాలవున్న ,వెనక ముందు గ్రూపుల గురించి మీ వెనకున్న గ్రూపులకి బాగా తెలుసని నాకు కూడా తెలుసని మీకు కూడా తెలుసు..ఈ కామెంట్ని అర్ధం చేసుకునే మైండ్ మీకు లేకపోతే నేను మిమ్మల్ని అలా వెనక్కి తీసుకెళ్లి చెప్తా అని త‌న‌దైన శైలిలో  స‌మాధాన‌మిచ్చి ముక్తాయించాడు. ఇంకా మ‌రికొంద‌రు టీడీపీ నేత‌లు కూడా వ‌ర్మ‌పై రేప‌టి వేళ  ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ తాను అనుకున్న‌దే చేస్తాన‌ని, విమ‌ర్శ‌లు రాజ‌కీయ ప‌క్షాల ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు ప‌ట్టించుకోన‌ని వ‌ర్మ స్ప‌ష్టం చేస్తున్నాడు.

 

Leave a comment