నాగార్జున .. ఫుల్ జోష్ లో ఉన్నాడు. రాజు గారి గది – 2 సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.తొలి సారిగా మెంటలిస్ట్ పాత్రలో నటించి అందరినీ మెప్పించడంతో ఆయన ఆనందానికి అవధే లేదు. ఇక కోడలితో నటించిన రెండో చిత్రం కూడా బంపర్ హిట్ కావడంతో ఈ సక్సెస్ ను గతంలో ఎన్నడూ లేని రీతిలో సెలబ్రేట్ చేసుకున్నానని అంటున్నాడు.‘‘రాజుగారిగది-2 సినిమా బాగుందనే టాక్ అన్నివైపుల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా నా ఫ్యాన్స్ ఈ సినిమా సక్సెస్ తో చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ల ముఖాల్లో ఆనందం కనిపించింది. రెండు బీర్లు తాగి.. బిర్యానీ తిని వాళ్ల సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నా’’ అని వ్యాఖ్యానించాడు నాగ్.
అంచనాలన్నీ రివర్స్
రాజుగారి గది-2 సినిమా అవుట్ పుట్ అనుకున్న స్థాయిలో రాకపోవడంతో నాగార్జున ఒకానొక టైంలో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడనేది అతడి సన్నిహితులు చెబుతున్న మాట. దాంతో రీ షూట్లకు వెళ్లాల్సి వచ్చింది. ఓంకార్ ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రయిలర్ కూడా నచ్చలేదనే విషయం బహిరం గంగానే చెప్పాడు. దీనికితోడు ఓవర్సీస్ లో సినిమా ప్రమోషన్ చేసే ప్రయత్నమే చేయలేదు. కానీ రాజుగారి గది-2 అమెరికా సంగతి ఎలా ఉన్నా ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో నాగార్జున పండుగ చేసుకుంటున్నాడు. తాను నటించిన సోగ్గాడే చిన్నినాయనని మించి ఆడాలని కోరుకుంటు న్నానని అంటున్నాడు. కోడలి పిల్ల రాకతో వచ్చిన ఈ కొత్త సక్సెస్ అక్కినేని వారింటి సంతోషాన్ని రెట్టింపు చేసింది అనడంలో సందేహమే లేదు.