ఓంకార్ డైరెక్ట్ చేసిన రాజు గారి గది 2 కి కింగ్ నాగార్జున ఓకే చెయ్యడం అందరిని ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. హారర్ కామెడీ తో తెరెకెక్కనున్న ఈ చిత్రంలో నాగార్జున నటించడమేంటి అనే సందేహం అందరిలోనూ నెలకొంది . ఈ చిత్రం లో ఫిమేల్ లీడ్స్ గ సమాంత , సీరత్ కపూర్ చేయగా , ప్రవీణ్ వెన్నెల కిషోర్ , షకలక శంకర్ కీలక పాత్రలు పోషించారు. పీవీపీ సినిమా , ఓక్ ఎంటర్టైన్మెంట్స్ , మాటినీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగ రిలీజ్ అయింది .
కధ:
వెన్నెల కిశోరె , అశ్విన్ బాబు , ప్రవీణ్ ముగ్గురు కలిసి ఒక లావిష్ బీచ్ ఫ్రంట్ రిసార్ట్ ని కొంటారు . వీరు ముగ్గురు ఆ రిసార్ట్ లోని దెయ్యాన్ని చూడటం , దాని నుండి తప్పించుకోవడానికి మెంటలిస్ట్ అయినా రుద్రా (నాగార్జున ) ని కలవడం , ఆ భూతం గురించి కొన్ని నమ్మలేని నిజాలను రుద్రా వారికీ చెప్పడం జరుగుతాయి . ఇక మిగిలిన కధ అంత అమృత (సమాంత) , సుహాసిని (సారీస్ కపూర్ ) కి ఆ దెయ్యానికి వున్నా సంబంధం ఏమిటి అనేదాని పైనే ఉంటుంది .
ఎనాలిసిస్:
ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ అండ్ ఫుల్ ఎంటెర్టైనింగ్ గ సాగుతుంది . స్టోరీ లైన్ చాలా ఇంట్రస్టింగ్ గ వుంది . రుద్రా (నాగార్జున ) క్యారెక్టర్ దెయ్యలతో డీల్ చేసే విధానం అద్భుతంగా వుంది . ఇంటర్వెల్ ఎపిసోడ్ చాల ఇంటరెస్టింగ్ గ ఉందనే చెప్పాలి . ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ , హారర్ సమ పాళ్ళ లో వున్నాయి . VFX ఎఫెక్ట్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం గ సెట్ అయ్యాయి ఈ చిత్రానికి .
సెకండ్ హాఫ్ ఎమోషనల్ గ హార్ట్ టచింగ్ గ సాగింది . సెకండ్ హాఫ్ లో కొంచం ఎంటర్టైన్మెంట్ తగ్గినట్టుగ అనిపించినా నరేషన్ తో కవర్ చేసాడు దర్శకుడు ఓంకార్ . సమాంత తన నటనతో డామినెటే చేసిందనే చెప్పాలి . క్లైమాక్స్ చాల కన్విన్సింగ్ గ వుంది . .
పెర్ఫార్మన్స్ :
నాగార్జున రుద్రాగా ఫుల్ ఎనర్జీ ని కనబరిచి అద్భుతంగా మెప్పించారు . అయన వేసే వన్ లైనేర్స్ ఎమోషనల్ సీన్స్ కి బలం చేకూర్చాయని చెప్పాలి . సమాంత తన అద్భుతమైన నటనతో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది . ఎమోషనల్ డ్రామా లో ఆమె నట వర్ణనాతీతం . షకలక శంకర్ , వెన్నెల కిషోర్ , ప్రవీణ్ కామెడీ తో మెప్పించారు , మిగిలిన పాత్రల్లో ఎవరి పరిధిలో వారు న్యాయం చేశారనే చెప్పాలి .
స్టోరీ చాలా డీసెంట్ గ సాగుతూ కొన్ని ఇంటరెస్టింగ్ ఎలెమెంట్స్ తో నిండి వుంది . స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ఇంటరెస్టింగ్ గ వున్నాయి , VFX , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను బాగా ఎలివేట్ చేసాయి . ప్రొడక్షన్ వాల్యూస్ , సినిమాటోగ్రఫీ అద్భుతంగా వున్నాయి . సినిమా చాలా లావిష్ గ వుంది . ఓంకార్ దర్శకత్వం పార్ట్ 1 కన్నా మెరుగు పడిందనే చెప్పాలి .
రాజు గారి గది -2 ఎంటర్టైన్మెంట్ , హారర్ ఎమోషన్స్ సమపాళ్లతో నిండివుంది . నాగార్జున , సమాంత ఇద్దరు ఈ చిత్రాన్ని తమ బుజ స్కంధాల పై నడిపించారు . ఫైనల్గా రాజు గారు గాది చూడ దగ్గ చిత్రం .
రేటింగ్ : 3 /5