‘బాహుబలి’ రికార్డ్స్ ను తుడిచి పెట్టగల సినిమా ఒకటి వస్తోంది. అదే ‘2.0’. నాలుగు వందల కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న ఈ సినిమా ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా గా నిలుస్తోంది. ఇది వరకూ ఈ రికార్డు బాహుబలి ప్రాజెక్ట్ పేరు మీద ఉండేది. కానీ శంకర్ ఆ రికార్డుని చెరిపేశారు.
భారీ బడ్జెట్ తో రూపొందించిన ‘బాహుబలి’ ‘బాహుబలి-2’ సినిమాల బడ్జెట్ కలిపి 450 కోట్ల రూపాయలు. అది రెండు సినిమాలుగా విడుదల అయిన ప్రాజెక్ట్. అయితే ‘2.0’ విషయంలో సింగిల్ గానే నాలుగు వందల కోట్ల రూపాయలు పెడుతున్నారు. దీంతో.. దేశీయ సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఇది తొలి స్థానాన్ని సంపాదించుకుంటోంది.
అందుకే పెట్టిన ప్రతి రూపాయీ వెనక్కి తెచ్చుకునే ప్రణాళికలో బాగంగా ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషలతో పాటు జపాన్, కొరియా, చైనాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సమాయత్తం అవుతున్నారు. అన్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేసిన మేకింగ్ వీడియో నెటిజనులను తెగ ఆకట్టుకుంటోంది. రజనీ శంకర్ కాంబో ఈ సారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.