ఓ విప్లవ వీరుడి పేరు తన కొడుకుకి పెట్టేందుకు ఇష్టపడుతున్నాడట పవన్. లేదంటే ప అనే అక్షరంతో ఏదైనా పేరు పెట్టేందుకు చూస్తున్నాడట! ఇందులో వాస్తవం ఎంతన్నది తెలియదు కానీ అభిమానులు తమకు తోచిన రీతిన సోషల్ మీడియలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారు మరి! పవన్, లెజ్నోవా దంపతులకు ఇటీవలే బాబు పుట్టిన సంగతి తెల్సిందే.తమ మొదటి సంతానమైన పాపకి పోలెనా అనే పేరు పెట్టిన పవన్, రెండో సంతానంగా పుట్టిన బాబుకి కూడా ‘ప’ సెంటిమెంట్‌నే ఫాలో అవుతాడన్నది కొందరి మాట.
గతంలో తనకూ, రేణూదేశా య్‌కి పుట్టిన పిల్లలకు అకీరా నందన్, ఆద్యా అనే పేర్లు పెట్టిన పవన్, ఇప్పుడు పుట్టిన వారసుడికి ఎటువంటి పేరు పెడతారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.