ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి తర్వాత అంతటి సూపర్ హిట్ జై లవ కుశ అనే చెప్పాలి . అంటే మిగతావి సూపర్ హిట్లు కావు అని కాదు . యాక్షన్ పరంగ ఎన్టీఆర్ మళ్లీ సింహాద్రి రేంజ్ లో చేసారని . దేశరా రిలీజ్ చిత్రలాంటిలో టాప్ గ నిలిచింది ఈ చిత్రం . పేరు లోనే జూనియర్ ఆక్షన్ లో క క క కాదు అనిపించుకున్నాడట ఎన్టీఆర్ ఈ సినిమాతో.
‘జై లవకుశ’ చిత్రానికి అన్నివైపుల నుంచి పవర్‌ఫుల్ టాక్ రావడం, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు కావడానికి కారణం.. ఒక్క ‘జై’ క్యారెక్టరేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ఒక్క పాత్రే పిల్లర్‌లా నిలిచి, సినిమాని బ్లాక్‌బస్టర్ దిశగా తీసుకెళ్తోంది. అయితే.. చివర్లో ఆ పాత్ర ఎండ్ కావడంపట్ల ఆడియెన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేశారు. క్లైమాక్స్‌లో జై క్యారెక్టర్‌ని చంపకుండా ముగ్గురు అన్నాతమ్ముళ్లు కలిసి హ్యాపీయే వుండే ఎపిసోడ్‌తో ముగించివుంటే బాగుండనే అభిప్రాయాలు వెలువడ్డాయి. అలాగని ఇప్పుడున్న క్లైమాక్స్ బాగోలేదని కాదు.. ఇప్పుడున్న ఆ క్లైమాక్స్ వల్లే ఎమోషన్ పీక్స్‌లో పండి, ఆడియెన్స్‌ని మరింత ఆకట్టుకుంది. కాకపోతే హ్యాపీ ఎండింగ్ వుండే బాగుండేదేమోనని జనాలు చెప్పుకుంటున్నారు.
సేమ్ ఇలాంటి అభిప్రాయమే తాజాగా పరచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. ‘‘మనం అనేది అబద్ధం.. నే నే నేననేది నిజం’ అనే డైలాగ్ ‘జై’ చెప్పినప్పుడు క్లైమాక్స్‌లో దానికి బ్యాలెన్సింగ్‌గా మరో సిట్యువేషన్ వస్తుందేమో అని, ఆ టైంలో ‘నేను అనేది అబద్ధం.. మ మ మనం అనేది నిజం.. మీరిద్దరూ నాకోసం చచ్చిపోవడానికి సిద్ధం అయితే నేనెందుకు చనిపోతాను’ అనే డైలాగ్ వుంటుందేమోని అనుకున్నాను. ఇది కేవలం నా అభిప్రాయమే. ఇప్పుడున్న క్లైమాక్స్‌కి నేను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు’ అని ఆయన చెప్పుకొచ్చాడు. అయినా.. ఇప్పుడు ఎన్ని సలహాలు ఇచ్చినా.. ప్రస్తుతమున్న క్లైమాక్స్‌ని ఎవ్వరూ మార్చలేరుగా!