బృందావనం తో ఎంతగానో ఆకట్టుకున్నాడు తారక్. దిల్ రాజు బ్యానర్లో తొలి హిట్ అందుకున్నాడు. తరువాత రామయ్య వస్తావయ్య నిరాశ పర్చింది. కోలుకొని వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ ఇలా విభిన్న చిత్రాలతో నట విశ్వరూపాన్నిచూపాడీ నందమూరి చందమామ.త్వరలో మళ్లీ దిల్ రాజు బ్యానర్లోనే ఓ సినిమా చేయనున్నాడు. వాస్తవానికి త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన పవన్ సినిమాతో బిజీబిజీగా గడుపుతున్నాడు.వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలవు తుంది.ఆ తరువాత ఎన్టీఆర్ స్క్రిప్ట్ పనులు మొదలుపెడతాడు. అంటే మధ్యలో చాలా సమయం గ్యాప్ దొరుకుతుంది. అంతసేపు ఖాళీగా ఉండడం ఇష్టంలేని ఎన్టీఆర్.. ఈ గ్యాప్‌లో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని టాక్.
ఈ విషయమై ఇటీవల దిల్ రాజుని కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ నెల 20న ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్‌కు వెళ్ళబోతు న్నాడు. అక్కడ రెండు వారాల పాటు గడిపి తిరిగి స్వదేశానికి రానున్నాడు.వాస్తవానికి త్రివిక్రమ్ కారణంగా ఆరేడు నెలల పాటు తన విలువైన సమయాన్ని వృథా చేసుకునే కన్నా మరో సినిమా చేస్తే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నాడు తారక్.. ఓ యువ డైరెక్టర్ చేతిలోనే ఈ క్రేజీ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది.త్వరలోనే ఇందుకు సంబంధించిన వెల్లడికానున్నా యి. దిల్ రాజు మాత్రం తన దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉందనే చెప్పాడట!! ఇక ఎన్టీఆర్ టూర్ నుంచి తిరిగి వచ్చాకే అన్ని వివరాలపై ఓ స్పష్టత రానుంది.