అక్టోబర్ 15 అంటే నివేథాకి భయం.ఎందుకని అడగరేం గూగుల్ చేసిన తప్పిదం వల్ల వచ్చిన భయం.. తన పుట్టిన రోజు కాకున్నా వెల్లువెత్తే విషెస్ అంటే ఆమెకు భయం.వీకీపీడియా చేసిన తప్పిదం గురించి.అందులో ఆమె బర్త్డే అక్టోబరు 15 అని ఉంది. దీంతో అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు లెక్కకు మిక్కిలి వచ్చాయి.ఆఖరికి ఆమె ట్వీట్ చేయక తప్పలేదు. ‘‘నన్ను విష్ చేయడానికి మీ సమయం వెచ్చిస్తున్నారు.
ఈ రో జు నా పుట్టిన రోజు కాదు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే’’ అని పేర్కొంది.ఆ పోస్ట్ చూసిన అభిమానుల ఉత్సాహం ఒక్కసారిగా నీరుగారిపోయింది. అయితే..తన పుట్టిన రోజు నవంబరు 2న అని నివేదా గత ఏడాదే స్పష్టం చేసింది. కాగా తెలుగులో చేసిన మూడు సినిమాలు హిట్ కావడం ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అటు బీఆర్క్ విద్యార్థిగానూ రాణిస్తోంది.తెలుగుతో పాటు కన్నడ సినిమా రంగం వైపు కూడా అడుగులు వేస్తోంది.