యాంకర్ గా మంచి మార్కులు కొట్టేసింది కొణెదల నిహారిక. ఒక మనసుతో నటిగా నిరూపించుకునేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. చాలా కాలం తరువాత ఓ వెబ్ సిరీస్ కి ప్లాన్ చేస్తోంది. ముద్ద పప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ తరువాత ఆమె చేస్తున్న ప్రయత్నమిది.నాన్న కూచి అనే టైటిల్ పై నీహారిక నటించిన వెబ్ సిరీస్ రూపొందగా.. దీన్ని కూడా ముద్దపప్పు-ఆవకాయ్ దర్శకుడు ప్రణీత్ బ్రహ్మానందపల్లి రూపొందిస్తున్నాడు.
ఈ వెబ్ సిరీస్ లో టైటిల్ కి తగినట్లుగానే నీహారిక నాన్న అంటే ప్రాణం పెట్టేసే యువతిగా నటించిందని తెలుస్తోంది. అయితే.. నాన్న పాత్రలో స్వయంగా నాగేంద్ర బాబే నటించడం విశేషం. ఇప్పటికే నాన్నకూచి షూటింగ్ కూడా పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దీనిని భారీ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరోవైపు రెండో సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది.