మాటలతో యుద్ధం చేయడం సులువు
అందులో వాస్తవం కన్నా రాజకీయం చేయాలన్న యావ ఉంటే గెలవడం కష్టం
బీజేపీ నేతలు ఇదే చేశారు .. ఫలితం విజయ్ సినిమాకు కాసులే కాసులుజ
విజయ్ త్రిపాత్రాభినయంతో ఇటీవలే కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మెర్సల్’ కోలీవుడ్‌లో సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది . ‘ఇళయ దళపతి’ విజయ్‌కి మెమరబుల్ ఫిల్మ్‌గా మిగలబోతోంది.ఆయన నటించిన అన్ని సినిమాల కన్నా ఇదే నంబర్ ఒన్ కానుంది. ఇక ఈ చిత్రంలో నిత్యమీనన్, సమంత, కాజల్ కథానాయికలుగా నటించారు. వీరిలో నిత్యమీనన్ విజయ్‌తో మొదటిసారి నటించగా కాజల్-సమంత ఇద్దరికీ ఇళయదళపతితో ఇది మూడో సినిమా. విజయ్-కాజల్ కలయికలో అంతకుముందు ‘తుపాకి’, ‘జిల్లా’ చిత్రాలు వచ్చాయి.
ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇక విజయ్-సమంత కాంబినేషన్‌లో గతంలో ‘కత్తి’, ‘తెరి’ చిత్రాలొచ్చాయి. ఈ సినిమాలు రెండు కూడా ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇలా కాజల్-సమంత ఇద్దరితోనూ ‘మెర్సల్’ విజయంతో హ్యాట్రిక్స్ కొట్టేశాడన్నమాట విజయ్. సినిమాలో ఉన్న కంటెంట్ విషయంలో రాజకీయంగా పలు విమర్శలు వచ్చినా అదంతా ‘మెర్సల్’కు మంచి పబ్లిసిటీనీ అందించింది. గడిచిన వారం రోజుల్లోనే ఈ చిత్రం రూ.180 కోట్ల వసూళ్లను కొల్లగొట్టిందని టాక్! ఇక ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందంటున్నారు.
ట్రేడ్ ఎక్స్ పర్ట్స్. బాసూ!! కుమ్మేయ్ ఇక..! రానున్న కాలంలో ఆయన రాజకీయాల్లో వచ్చినా రాకున్నా హీరోగా చేసే ప్రతి సినిమా కూడా ఇలానే ఏదో ఓ వివాదానికి తావిచ్చేలా చేసేందుకు మన నేతలు తెగ తాపత్రయ పడడం ఖాయం. బట్ పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదుగా!!