తమిళ్ ఏస్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం సెప్టెంబర్ 26న రిలీజ్ అయ్యి డిసాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే . మహేష్ బాబు కేరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా స్పైడర్ . 120 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు 50 కోట్ల వరకు నష్టాలు మిగిల్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా .
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ ఆ లాస్ ని కొంత మేరకు భరిస్తారని వినికిడి . తన రెమ్యూనరేషన్ లో కొంత భాగం తిరిగిచ్ఛే ఆలోచనలో ఉన్నారట మహేష్ . అయితే 25 కోట్ల వరకు తీసుకున్న మహేష్ ఎంత వరకు తిరిగి ఇస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది . ఆ మొత్తాన్ని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ భరత్ అను నేను చిత్రం రిలీజ్ లోపు ఇచ్చేస్తానని మహేష్ ఒప్పుకున్నట్లు సమాచారం .
అయితే మహేష్ కి ఇది కొత్తేమికాదు, ఇంతక ముందు కూడా చాలా సార్లు ప్రొడ్యూసర్స్ ని సేవ్ చేసే ప్రయత్నం చేసారు . ఆ ప్రొడ్యూసర్స్ కి అయితే తన రెమ్యూనరేషన్ లోని కొంత భాగాన్ని తిరిగివ్వడమో లేక మరో సినిమా తక్కువ రెమ్యూనరేషన్ కి చెయ్యడమో చేసారు పూర్వం. చూడాలి మరి మహేష్ స్పైడర్ ప్రొడ్యూసర్స్ ని ఎంత వరకు సేవ్ చేస్తారో