కింగ్ నాగార్జున ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓ వైపు తన ఇంటి పెళ్లి సందడితోనూ, మరోవైపు తన సిన్మా సీక్వెల్ బీ టౌన్లో కాసుల వర్షం కురిపిస్తుం డడంలోనూ.. వీటికి అదనంగా మరికొద్ది రోజుల్లో ఆయననటించిన రాజుగారి గది 2 విడుదలవుతుండడంతోనూ ఆయనఆనందానికి అవధే లేకుండా పోతోంది.1997లో ఈ సినిమాను హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా ‘జుడ్వా’గా రీమేక్ చేశారు.
డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘనవి జయం సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘జుడ్వా 2’ వచ్చింది. ఇందులో వరుణ్ థావన్, తాప్సి, జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌లు నటించారు. గత శుక్రవారం విడుదలై ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌కి చేరువలో ఉంది.వాస్తవానికి ‘హలో బ్రదర్’..1994లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసు ల వర్షం కురిపించింది.
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయం చేయగా.. ఆయన సరసన సౌందర్య, రమ్యకృష్ణ నటించారు. తర్వాత ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయగా అక్కడా సూపర్ హిట్‌గా నిలిచింది.అంతేకాదు బాహుబలి-2 తర్వాత వరుస పరాజయాలు చవిచూస్తున్న బాలీవుడ్‌ను ఈ సినిమానే ఆదుకుంది.ఓపెనింగ్ పరంగా(హిందీ చిత్రాలు) రూ.41 కోట్లతో ‘బాహుబలి 2’ తొలిస్థానంలో, రూ.21.15 కోట్లతో ‘ట్యూబ్‌లైట్’ రెండోస్థానంలో, రూ.20.42 కోట్లతో ‘రయీస్’ మూడోస్థానంలో నిలవగా.. ‘జుడ్వా 2’ నాలుగో స్థానంలో నిలిచింది.
2017లో హిందీలో ‘బాహుబలి 2’ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘జుడ్వా 2’ స్థానం దక్కించుకునే అవకాశం ఉంది.మొత్తానికి సాంబారు కథలంటూ మన సినిమాలను వెక్కిరించే బాలీవుడ్ జనం ఇప్పుడు అవే కథలని తీసుకుని రీమేక్స్‌గానూ, సీక్వెల్స్ గానూ తెరకెక్కించి నాలుగు కాసులు సంపాదిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు హలో బ్రదర్, బాహుబలి, కిక్ తదితర చిత్రాలే రుజువు.