రాజకీయాల్లోకి రాకమునుపే అనేకానేక అంశాలపై స్పందిస్తున్నారు కమల్. ట్విటర్ వేదికగా తానేం చెప్పాలనుకుంటున్నారో చెప్పేస్తున్నారు. బీజేపీ ని టార్గెట్ గా చేసుకుని ఆయన పలు ట్వీట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విజయ్ మెర్శల్ సినిమాపై రేగిన వివాదానికి బీజేపీ బదులు ఇవ్వాల్సిందేనని చెబుతున్నాడు. ‘విమర్శలు ఆపేందుకు ప్రయత్నించకండి. మెర్సల్‌ను సెన్సార్‌బోర్డు ధ్రువీకరించింది. మరోసారి సెన్సార్ చేయాల్సిన అవసరం లేదు. విమర్శలు వచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పాలి’ అని కమల్ ట్వీట్ చేశాడు. ప్రముఖ తమిళ నటుడు విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రం పై వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)కి సంబంధించిన డైలాగులను తొలగించాలంటూ భాజపా డిమాండ్ చేస్తోంది. ఈ వివాదంపై విలక్షణ నటుడు కమల్‌హాసన్ స్పందించారు. సినిమా అన్ని విధాలా సరిగ్గా ఉందంటూ మెర్సల్‌కు మద్దతు పలికారు.కాగా ఇటీవల పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి తాను తొందరపడి మద్దతిచ్చానని, అందుకు ప్రజలకు క్షమాపణ చెబుతున్నట్లు కమల్ వ్యాఖ్యలు చేశారు. దీపావళికి విడుదలైన మెర్సల్ చిత్రంలో డిజిటల్ ఇండియా, జీఎస్‌టీపై ఉన్న డైలాగులు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాలో జీఎస్‌టీ గురించి చెప్పినవన్నీ అసత్యాలేనని..వెంటనే ఆ డైలాగులను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఇక ఈ వివాదం ఇంకెన్ని రాజకీయ రంగులు పులుముకుంటుందో చూడాలి.