ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా త్వరలో ఓ చిత్రం సెట్స్‌పైకి రానున్న విషయం అందరికి తెలిసిందే. దర్సకుదు తేజా కూడా ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నటు తెలుస్తుంది, ఆ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తీసుకువచ్చే ప్రయత్నంలో తేజ ఉన్నారు. అందులో భాగంగానే పబ్లిసిటీ ఫీలర్లు రిలీజ్ చేస్తూ వస్తున్నాడు.
ఇప్పటికే ‘లక్ష్మీ’స్ ఎన్టీఆర్’ అని రామ్‌గోపాల్ వర్మ, దానికి పోటీగా ‘లక్ష్మీ’స్ వీరగ్రంథం’ అనే పేరుతో మరో సినిమా మొదలైన విషయం తెలిసిందే, ఇవేమి పట్టించుకోకుండా తేజ తన పని తాను చేసుకు పోతున్నాడు, ఈ సినిమాకి దర్శకుడు తేజ నటుల ఎంపిక కూడా కాస్త వైవిధ్యంగా చేస్తున్నారనే తెలుస్తుంది.
నందమూరి తారకరామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం వినపడుతుంది. ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. మరి హరికృష్ణ పాత్రలో ఎవరు నటిస్తారు అనే విషయం అందరిలోనూ ఆసక్తిని రేకిస్తుంది.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం తేజ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్‌రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్ర చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక మరింత ఆసక్తిని రేకిస్తున్న విషయం చంద్రబాబు పాత్రని జగపతిబాబు చేయనున్నారట.
ఇదే నిజమైతే దర్శకుడు తేజ నటుల ఎంపిక లో సెన్సేషన్ క్రీయేట్ చేశారనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో తేజ చంద్రబాబు ని ఏ విధంగా చూపిస్తారు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ మధ్యకాలం లో ఎన్టీఆర్ జీవితంలో అసలు విలన్ చంద్రబాబే అంటూ అనేక కథనాలు ప్రచారం అవుతున్న విషయం విదితమే. వర్మ కూడా తన సినిమాలో చంద్రబాబుని అదే నెగటివ్ కోణం లో చూపించనున్నారని సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి రెండవ వారం నుండి మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. నందమూరి బాలకృష్ణతో కలిసి సాయి కొర్రపాటి, విష్ణు ఇందుకూరి ఈ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.