అందం ఒకటి చాలు అనుకుంటే కాదు
అభినయం తోడుంటే చాలు అనుకుంటే కాదు
అందం అభినయం వ్యక్తిత్వం అదృష్టం ఇలా కొన్ని గుణాలు
వెన్నంటే ఉంటేనా నాయకిగా రాణింపు. కాజల్ ని చూస్తే ఆఫ్ సెంచరీ చేసిన హీరోయిన్ లా కనిపించదు. కానీ ఇప్పటికీ అదే తపనతో ప్రతి చిత్రానికీ పనిచేస్తోంది. త్వరలో ఆమె నటించిన మెర్సెల్ విడుదల కానుంది. ఈ సందర్భంగా టీ టౌన్ చందమామ కాజల్ తన మనసులో మాటలు చెప్పింది. యాభై సినిమాలు తరువాత తన తొలి చిత్రం హీరో కల్యాణ్ రామ్‌తో త్వరలో తెర పంచుకుంటోంది.ఎమ్మెల్యే సినిమాలో ఆమె నాయకిగా నటిస్తోం ది.‘నా కెరీర్ ‘లక్ష్మీకళ్యాణం’ సినిమాతో ప్రారంభమైంది.
అందులో కల్యాణ్‌రామ్‌తో కలిసి నటించా. దాదాపు 50 సినిమాల తర్వాత ఆయనతో మళ్లీ సినిమా చేస్తున్నా. నేను, ఆయన ఇప్పటికీ ఒకేలా ఉన్నాం. పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాం. అనుభవం వచ్చింది. మిగిలిన గుణాలన్ని అప్పటిలాగే స్థిరంగా ఉన్నాయి’అని కితాబిచ్చింది.అంతేనా అందంగా ఉండాలంటే ఏం చేయాలో కూడా సెలవిచ్చింది. బాగా నిద్రపొండి.. పండ్లు, కూరగాయలు తినండి, నీళ్లు తాగండి. సన్‌స్క్రీన్ వాడండి. యోగా చేయండి, నేనూ చేస్తా. పాజిటీవ్‌గా ఉండండి.. అది చాలా ముఖ్యం.. అని చెప్పింది. ప్రస్తుతం ఆమె నటించిన ద్విభాషా చిత్రం మెర్సెల్ (తెలుగులో అదిరింది) సినిమా ఈ దీపావళి కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో నటిగా తన ప్రయాణం బాగుందని చెప్పింది.‘నా ప్రతి సినిమా నాకు ముఖ్యమే. నా సినిమాలు, నా పిల్లలతో సమానం. వాటిని పెంచి, విజయవంతం చేయడం నా బాధ్యత’ అని సెలవిచ్చింది.