మెర్సల్ సినిమా వివాదాల కారణంగా హాట్ టాపిక్ గా మారింది.విజయ్ కెరియర్లోనే అత్యుత్తమ పిక్చర్ గా నిలిచింది.పలువురి ప్రముఖులలోనూ కదలిక తీసుకువచ్చింది.దీంతో రేపటి వేళ తెలుగులోనూ అదిరింది పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమైంది.వాస్తవానికి తమిళ్ వెర్షన్తో పాటుగా తెలుగు వెర్షన్ విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల రీత్యా ఆలస్యమైంది.ఇక ఈ వివాదం పూర్తిగా సద్దుమణగక ముందే మరో తమిళ సినిమా జీఎస్టీపై సెటైర్లు వేసింది.
రంగం ఫేం జీవా ప్రధాన పాత్రలో వస్తున్న తమిళ సినిమా ‘కీ’ .. ఇటీవల విడుదల చేసిన ప్రొమోలో జీఎస్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.అయితే బీజేపీ నేతలు ఇంత వరకూ ఈ ప్రోమోపై స్పందించకపోవడం గమనార్హం.రంగం తరువాత పెద్దగా సక్సెస్లు లేని జీవా ఈ సినిమాతో అయినా మంచి ఫాంలోకి వస్తాడని ఆశిద్దాం.