ఓ డైరెక్టర్ సమీక్షలపై స్పందించాడు
తాను తీసిన సినిమా రిజల్ట్ అటుగా ఇటుగా ఉన్నా
చెప్పాలనుకున్నదేదో చెప్పాడు..
అతడే తిరుమల కిశోర్.. ఉన్నది ఒక్కటే జిందగీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు ఏమంటున్నాడంటే..
‘‘నేను పదో తరగతి పరీక్షలు రాశాక రిజల్ట్స్ వచ్చాయి. నేను.. నా క్లోజ్ ఫ్రెండ్ కలిసి రిజల్ట్స్ చూసుకోవడానికి బయల్దేరాం. మా ఊరు అవతల కాలువ దాటి అవతలికి వెళ్లి పేపర్ కొనుక్కుని రిజల్ట్స్ చూడాల్సిన పరిస్థితి. అలా నేను.. నా ఫ్రెండ్ వెళ్తూ ఉంటే.. ఇంకొకడు ఎదురొచ్చాడు. మమ్మ ల్ని చూడగానే.. నేను ఫస్ట్ క్లాస్ లో పాసయ్యానని చెప్పాడు. పక్కనున్న ఫ్రెండ్ ఫెయిల్ అనేశాడు. దీంతో వాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఐతే నేను అతడిని ఓదార్చి.. రారా మనం వెళ్లి చూద్దాం అని తీసుకెళ్లాం. పేపర్ తీసి చూస్తే నా ఫ్రెండు కూడా ఫస్ట్ క్లాసులో పాసయ్యాడని తెలిసింది. కా బట్టి ‘ఉన్నది ఒకటే జిందగీ’ గురించి ఎవరో ఏదో అన్నారని ఆగిపోవద్దు. వెళ్లి థియేటర్లో సినిమా చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది’’ అని అన్నాడు కిశోర్. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇదే విధంగా రివ్యూ రాసె వారి పై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.