Gossipsపవన్ సినిమా ఫ్లాప్ అని ఆ డైరెక్టర్ ముందే చెప్పాడు

పవన్ సినిమా ఫ్లాప్ అని ఆ డైరెక్టర్ ముందే చెప్పాడు

జయంత్ సి.పరాంజీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్టార్ డైరెక్టర్ కానీ ఈ మధ్య ఈ డైరెక్టర్ పరిస్థితి ఏ మాత్రం బాగొలేదనే చెప్పాలి. తను ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్లాపుల గురించి.. నిజాలు మాట్లాడాడు. నిజం మాట్లాడినప్పుడు విమర్శలు రావడం షరా మాములే కదా అదే ఎదురైంది జయంత్ సి పరాన్జీ కి కూడా. ‘సక్సెస్ లో ఉన్నప్పుడూ లేనప్పుడూ ఒకేలా ఉంటారు. అది మీకెలా సాధ్యం?’ అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… ‘టక్కరిదొంగ’ డిజాస్టర్ అయినప్పుడు కూడా నేను నిరాశ చెందలేదు. వెంటనే ‘ఈశ్వర్’ మూవీ షూటింగ్ మొదలుపెట్టాను. హిట్లు కానీ… ఫ్లాపులు కానీ.. నన్ను ప్రభావితం చేయలేవు. అదే నా ‘బలం’ అని చెప్పాడు జయంత్. అక్కడితో ఆగితే బావుండేది.. తన ఇంకో డిజాస్టర్ గురించి కూడా మాట్లాడాడు. అక్కడే వచ్చింది సమస్యంత. ఆ డిజాస్టర్ ఏంటో చెప్పనేలేదు కదూ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘తీన్ మార్’. పైగా ఈ సినిమా గురించి చెబుతూ ‘అది ఫ్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు’ అని నోరు జారాడు జయంత్. ఇంకేముంది రచ్చ మొదలైంది. ఈ విషయంపై జయంత్ మాటలు ఇలా ఉన్నాయ్:

‘తీన్ మార్’ ఒక రీమేక్ సినిమా. అంతకు ముందు కూడా రెండు రీమేక్ లు చేశాను. అవే… లక్ష్మీ నరసింహా, శంకర్ దాదా ఎంబీబీఎస్.
వాటికీ మన తెలుగు ప్రేక్షకులకి నచ్చే విధంగా కొన్ని మార్పులు చేశాను అవి సత్ఫలితాన్నిచ్చాయి కావున ఆ రెండు సినిమాలు హిట్ గ నిలిచాయి.

నిజానికి తీన్ మార్ సినిమాకి కూడా మార్పులు చేయాలి నాకు మార్పులు జరగాలని అనిపించినా…అక్కడ కుదర్లేదు. మాతృకను మక్కీకి మక్కీ దించాల్సి వచ్చింది.
ఆ సినిమా చేస్తున్నప్పుడే ‘ఇది ఫ్లాప్’ అవుతుందని అనుకున్నాను. అనుకుందే జరిగింది అని చెప్పాడు. ఇంత మాట్లాడాక పవర్ స్టార్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? ‘ఫ్లాప్ అని తెలిసిన తర్వాత కూడా సినిమా ఎందుకు పూర్తి చేశావ్ అని విరుచుకుపడ్డారు. అంత పెద్ద స్టార్ హీరో సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఇస్తే.. దాన్ని సద్వినియోగం చేసుకోకపోగా…ఇప్పుడు ఆ చేదు అనుభవాన్ని గుర్తు చేస్తావా?’ అంటూ జయంత్ పై పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news