పవర్ సినిమాతో అప్పటిదాకా రైటర్ గా ఉన్న కె.ఎస్.రవింద్ర అలియాస్ బాబి దర్శకుడిగా మారి హిట్ అందుకున్నాడు. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన ఆ సినిమా బాబి డైరక్షన్ టాలెంట్ ఏంటో చూపించింది. ఇక ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ తీసినా దాని కర్త్ కర్మ క్రియ అంతా పవన్ చూసుకున్నాడు కాబట్టి ఆ ఫ్లాప్ తాలూఖా నీలి నీడలు బాబి మీద పడలేదు.
అయినా సరే కొద్దిరోజులు గ్యాప్ తో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో జై లవ కుశ తీసి హిట్ కొట్టాడు. సినిమా అంతా తారక్ నడిపించాడు కాని తెర వెనుక బాబి కష్టం అందరు గుర్తించారు. ఇతను టాలెంటెడే అని స్టాంప్ కూడా వేశారు. కాని ఏం లాభం తన తర్వాత సినిమాకు హీరోలు కరువైన పరిస్థితి వచ్చింది. స్టార్స్ అంతా రెండు మూడు సినిమాలతో బిజీ షెడ్యూ తో ఉండగా బాబికి హీరో దొరకడం లేదట.
అసలైతే అల్లు అర్జున్, రవితేజలతో సినిమా చేయాలని చూసినా వారిద్దరు వేరే సినిమాల కమిట్మెంట్ లో ఉండటంతో ప్రస్తుతం బాబి ఎవరితో సినిమా చేయాలా అన్న కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు. ఈమధ్య నానితో సినిమా చేయాలన్నట్టు టాక్ వచ్చినా నాని కూడా మరో మూడు సినిమాల తర్వాతే అన్నాడట. సో ఈ లెక్కన చూస్తే బాబి మరో ఏడాది దాకా ఖాళీగానే ఉండేలా కనిపిస్తున్నాడు. హిట్ కొట్టినా సరే మనోడికి పిలిచి అవకాశం ఇచ్చిన హీరో లేడంటే ఆశ్చర్యంగానే ఉంది.