ఒక్క సినిమానీ విడుదల చేయలేకపోయాడు రామ్ చరణ్ .. రంగస్థలం కమిట్ మెంట్ తరువాత కొన్ని కారణాల రీత్యా వెనుకబడిపోయాడు.దీంతో ఇక నుంచి తన సినిమాల విషయంలో వేగం పెంచాలనుకుంటున్నాడు. కనీసం ఏడాదికి రెండు సినిమాలు చేస్తే బెటర్ అన్నది ఆయన భావన.మరోవైపు నిర్మాతగానూ అడుగులు వేస్తున్న సంగతి తెల్సిందే! తండ్రి చిరంజీవి నటిస్తోన్న సైరా నరసింహా రెడ్డి సినిమాకు నిర్మాత ఈయనే!అంతేకాక బిజినెస్ మెన్ గానూ రాణించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.
భార్య ఉపాసన కామినేని ప్రోత్సాహంతో అటుగా అడుగులు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.అన్నట్లు ఈ దీపావళి వేడుకలను అత్తారింట్లో సన్నిహితుల నడుమ చేసుకుని కొత్త ఉత్సాహాన్ని నింపుకున్నాడు.అన్నీ కుదిరితే బాబాయ్ పవన్ తోనూ ఓ సినిమాని నిర్మించేందుకు సై అంటున్నాడు.
ఇక అసలు విషయంలోకి వస్తే..ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో రంగస్థలం 1985 సినిమాని చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి లో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. వాస్తవానికి సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నా గ్రాఫిక్ వర్క్, షూట్ పార్ట్ ఇలా అన్నీ అన్నీ ఆలస్యం కావడంతో సినిమాని సమ్మర్ సప్రైజ్ గా విడుదల చేద్దామని అనుకుంటున్నారు.
ఈ సినిమా పూర్తవ్వగానే చెర్రీ మరొక సినిమాను సెట్స్ పైకి తేవడానికి రెడీ అయ్యాడు. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రీసెంట్ గా ఒక కథను విన్న చెర్రీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో బోయపాటిని డిసెంబర్ కి రెడీగా ఉండమని చెప్పాడు.
రంగ స్థలం అయిపోగానే అటుగా కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే చరణ్ ఇంతకుముందు కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక కథను ఒకే చేశాడు. దానికంటే ముందే బోయపాటి సినిమాను పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ రెండు సినిమాలను రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నాడు.