తారక్ .. తాతకు తగ్గ మనవడు.. ఎలాంటి క్యారెక్టర్ ని అయినా అలవోకగా పండించగల నటుడు. డైలాగ్ ని అద్భుతంగా పలకడ సమర్థుడు.. అలాంటిది ఆయనో క్యారెక్టర్‌కి నో చెప్పాడు. తన తాత పాత్రలో నటించేంది లేదని, అంత ధైర్యం లేదని తేల్చేశాడు. అసలీ తరహా ప్రయత్నమే చేయననిచెప్పాడు. ‘మా తాతయ్య ఆరోజు కుటుంబాన్ని విడిచి ప్రజలకు సేవ చేయడానికి (రాజకీయాల్లోకి) వెళ్లి, రాష్ట్ర ప్రజల ఆస్తిగా మారారు.
ఆయన జీవితం గురించి సినిమా తీస్తామని ఎవరు ముందుకొచ్చినా.. మరొకరు దాన్ని ఆపగలరని నేను అనుకోవడం లేదు. ఆయనపై సినిమా తీసే స్వేచ్ఛ అందరికీ ఉంది.’ అని తారక్ అన్నాడు. వాస్తవానికి ఎన్టీఆర్ జీవిత కథతో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే రామూ టైటిల్ కూడా ఎనౌన్స్ చేసి పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రూపొందే ఈ సినిమాపై అప్పుడే అనేకానేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు డైరెక్టర్ తేజ కూడా నేనే రాజు నేనే మంత్రి హిట్ తరువాత బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని టాక్.
అది ఎన్టీఆర్ బయోపిక్ అవుతుందా లేకా పొలిటికల్ డ్రామాతోనే వేరే కథ తో ఆ సినిమా చేస్తారా అన్నది ఇప్పటికింకా క్లారిఫికేషన్ లేదు. ఇక రామూ తెరకెక్కించే సినిమాలో ఎన్ని నిజాలు వెల్లడి అవుతాయో లేదో అన్నది తేలాల్సి ఉంది.