ఒక్క సినిమా ఫేట్ ని మారుస్తుంది.. రాతని తిరగ రాస్తుంది.. దీపికా పదుకోనే కెరియర్‌లో ఒకటి కాదు రెండు సినిమాలు అలా వచ్చి చేరాయి. అవి ఒకటి బాజీరావు మస్తాని రెండు పద్మావతి.‘పద్మావతి సినిమాకు నన్ను ఎంపికచేసుకోవడం నిజంగా నా అదృష్టం. కానీ ఈ సినిమాలో నటించడ మంటే చాలా శ్రమతో కూడుకున్న పని. గతఐదేళ్లలో వరుసగా మూడు భారీ చిత్రాల్లో నటించడమంటే మామూలు విషయం కాదు. పద్మావతి సినిమా కోసం ఎనిమిది నెలల పాటు నిర్వరామంగా చిత్రీకరణ జరిపాం. ఈ చిత్రంలోని కొన్ని పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేరు కూడా.’ అని చెబు తోందీ సుందరి.
డిగ్రీ కూడా చదవలేకపోయా
ముంబయిలో హేమమాలిని ఆటోబయోగ్రఫీ పుసక్తవిడుదల కార్యక్రమంలో దీపిక పాల్గొంది. ఈ సందర్భంగా తన కెరీర్, ప్రేమ విషయాల గురించి ఎన్నో ఆసక్తిదాయక విషయాలు వెల్లడించిది.‘చాలా మంది నేను అందుకొన్న విజయాలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలీక పక్కకు తప్పుకొన్నా రు. ఈ విషయంలో నాకు ఎలాంటి బాధ లేదు.జీవితం అలాగే సాగిపోతోంది. మనకు దగ్గరగా ఉన్నవాళ్లే మన గురించి అర్థంచేసుకోగలరు. నేను సరిగ్గా కాలేజ్‌కి వెళ్లింది లేదు.
కేవలం ఇంటర్మీడియట్‌తో చదువు ఆపేశా. దీని వల్ల నా తల్లిదండ్రులు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. అదే సమయం లో నేను సక్సెస్‌ఫుల్ మోడల్ కూడా అయ్యాను. ఆ తర్వాత డిగ్రీ చదవాలని ప్రయత్నించాను కానీ కుదరలేదు. దూరపు విద్యకు కూడా ప్రయత్నించాను. అది కూడా చేయలేకపోయాను.’ అని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది.