దసరాకు టాలీవుడ్ బాక్సాఫీస్ యుద్ధం అదిరిపోయింది. ఎన్టీఆర్, మహేష్‌బాబు సినిమాలతో పాటు యంగ్ శర్వానంద్ సినిమా కూడా రిలీజ్ అవ్వడంతో ఈ మూడు సినిమాల రిలీజ్‌కు ముందు ఏ సినిమా పై చేయి సాధిస్తుందా ? అన్న ఉత్కంఠ అందరిలోను నెలకొంది. మూడు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుడి తీర్పు వచ్చేసింది.
ఈ మూడు సినిమాల్లో వారం రోజుల ముందుగా వచ్చిన ఎన్టీఆర్ జై లవకుశ సినిమా ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా 73 కోట్ల షేర్ క్రాస్ చేసి రూ.75 కోట్ల షేర్ మార్క్‌కు దగ్గరవుతోంది. జై లవకుశ బయ్యర్లు సేఫ్ జోన్‌లోకి రావాలంటే ఇంకా ఈ సినిమా 15-20 శాతం రికవరీ చేయాల్సి ఉంది. జై లవ కుశ స్పీడ్ చూస్తుంటే కచ్చితంగా ఇంకో వారం రోజుల్లో బయ్యర్స్ ని సేఫ్ జోన్ లో పడేసి లాభాల బాటలో పడేసేలావుంది.
ఇక మహేష్ స్పైడర్ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.50 కోట్ల షేర్ మార్క్‌కు దగ్గరవుతున్నా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్‌కు, వసూళ్లకు అస్సలు పొంతన లేకపోవడంతో స్పైడర్ బయ్యర్లు 50 శాతానికి పైగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా రూ.120 కోట్ల బిజినెస్ జరిగింది. సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఈ సినిమా భారీ డిజాస్టర్ అనుకోవాల్సిందే.
ఇక పండగకు సైలెంట్‌గా థియేటర్లలోకి దిగిపోయిన శర్వానంద్ మహానుభావుడు ఓవర్సీస్‌లో హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్ సులువుగానే క్రాస్ చేసేసింది. ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా రూ.10 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా మరో ఒకటి రెండు రోజుల్లో సేఫ్ జోన్‌లోకి వచ్చేయనుంది. సినిమాను యూవీ క్రియేషన్స్ తక్కువ బడ్జెట్‌లో నిర్మించడంతో పాటు బయ్యర్లకు కూడా రీజన్‌బుల్ రేట్లకే అమ్మడంతో జై లవకుశ, స్పైడర్ సినిమాల కంటే ఈ సినిమా కొన్న వారు ముందుగా లాభాల్లోకి వచ్చేయనున్నారు. మహానుభావుడు లాంగ్ రన్‌లో రూ.30 కోట్ల షేర్ రాబడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.