కొత్త వివాదం పుట్టుకొచ్చింది. విశ్వవిఖ్యాత నటుడు పేరిట వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమా ఇంకా ప్రారంభం కాకమునుపే రాజకీ యాలు వేడెక్కాయి. సినిమా ప్రారంభం కాకమునుపే ఇండస్ట్రీలో జనాల బుర్రలూ వేడెక్కుతున్నాయి. వర్మ వెర్సస్ టీడీపీ నిన్నటిదాకా జగన్ వె ర్సస్ బాబు.. మారింది పంథా మారింది. మారింది వర్మ స్వరం తీవ్రత కూడా మారింది. సున్నితమైన సెటైర్లతో అందరినీ హడలగొడుతున్నాడు వ ర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ పేరుతోనే ఎన్నికల ముందు ఓ సంచలనం కావాలని వర్మ భావిస్తున్నాడా.. లేకా వైఎస్సార్ సీపీ భావిస్తుందా.. ఇంతకూ మీ రు సినిమా తీస్తారా అని అడిగితే ఎవరి మీద పడితే వారి మీదే ఒట్టు వేస్తున్నాడు. అమ్మ తోడు అయ్యతోడు పాట మాదిరిగా వర్మ ప్రవర్తిస్తున్నాడు. ఎమ్మెల్యే అనిత, ఒక నాటి నాయకి వాణి విశ్వనాథ్ , మంత్రి సోమిరెడ్డి ఇలా అందరికీ కౌంటర్లు ఇచ్చి పారేస్తున్న వర్మ ఇంతకూ స్క్రిప్ట్ ఏం రెడీ చేశారో!! అన్నది ఎవ్వరికీ పాలుపోవడం లేదు. ఇక బాలయ్య తీస్తానన్న బయోపిక్ పై మాత్రం ఇంత రగడ జరగడం లేదు.తేజ డైరెక్షన్ లో రూపొందనున్న సినిమా ఇంకా ఇప్పట్లో ప్రారంభం అయ్యేలా లేదు. వాస్తవానికి గతంలో వర్మ తీసిన బయోపిక్స్‌తో ఆయన పెద్దగా సాధించిందేమీ లేదు. కిల్లింగ్ వీరప్పన్ తీశాక మహా అయితే ఆయన భార్య ముత్తు లక్ష్మితో నాలుగు చీవాట్లు తినడం మినహా ఆయనేదో ఆన్ స్క్రీన్ వండర్ ఏమీ సృష్టించాడు అనుకోవడానికి లేదు. రక్త చరిత్ర కూడా అంతే సీమ నేపథ్యంలో తెలివిగా వ్యవహిరించి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తన పని కానిచ్చేశాడు. ఇక వంగవీటి సినిమా ఓ నాసిరకం సినిమా అని తేలిపోయి చాలా కాలమైంది. ఇంకేం తీశాడని ఏం తీయగలడని?? ఇక ఈ సినిమా కూడా అంతే! ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంటరయ్యక ఏం జరిగింది అన్నది ఆయన కథ.. ఇందులో చంద్రబాబు పాత్రని చూపిస్తాడా లేదా అన్నది ఆసక్తిదాయకం.
గతంలో ఇలాంటివెన్నో…
ఎన్నికల వేళ ఇలా సినిమాలు రావడం ఇవాళ కొత్తకాదు. అప్పట్లో దాసరి ఇలాంటి ప్రయత్నాలు చేసేవారు. మేస్త్రీ సినిమాని అలా రూపొందించిందే! అలానే ఎన్టీఆర్ కూడా రాజకీయాలకు రాక ముందు నా దేశం అనే సినిమా తీశాకనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అలానే వైఎస్సార్ సీపీ కూడా తెలియని ఎన్టీఆర్ కథని అందరికీ తెల్సిన వర్మతో చెప్పించాలని ప్రయత్నం చేస్తోంది. గతంలో పూరీ జగన్నాథ్ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై ఓ కథని అనుకున్నారు.అలానే బాలయ్యకి సాక్షి ఫీచర్స్ ఎడిటర్ రాం రెడ్డి రైతు అనే కథని వినిపించి, కృష్ణ వంశీ డైరెక్షన్లో సినిమా తీయాలని, బిగ్ బీ స్పెషల్ రోల్ లోనటింపజేయాలని ఉవ్విళ్లూరారు.అలానే రెడ్డిగారు పోయాక అనే టైటిల్‌తో కూడా వర్మ ఓ సినిమాని అనౌన్స్ చేశాడు. ఇవి ఇలా ఉంటుంటుండానే రాజా వారి చేపల చెరువు పేరిట పోసాని కూడా ఓ పొలిటికల్ సెటైర్ తీశాడు కూడా! ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్‌ని బయోపిక్ అంటున్నారు కానీ ఇది కూడా పొలిటికల్ సెటైర్ కాక తప్పదు. మరో 18 నెలల పాటు అధికారంలో టీడీపీ ఉండనుంది. ఈ నేపథ్యంలో రెండు బయోపిక్స్‌లో ఏది ముందు విడుదల కానుందన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుం ది.అందాక రామూ సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం ఖాయం. అటుపై సినిమాని తుస్సు మనిపించడమూ ఖాయం అన్నది సినీ పరిశీలకుల మాట!