రాజకీయాలు అన్నీ స్వార్థ ప్రయోజనాలు చుట్టూ తిరుగాడుతాయన్నది ఓ సత్యం.
అది ప్రాంతాలకు అతీతం.. నీతి నియమాలకూ అతీతం
వ్యక్తిగత ప్రయోజనం నెరవేరితే చాలు.ఇంకేమీ వద్దు అనుకునేవారే ఎక్కువ
తాజాగా ఏపీ సర్కార్‌లో కేసీఆర్ ఫ్యాన్స్ సంఖ్య పెరిగిపోతుండడమే ఇందుకు తార్కాణం.
వివరాలిలా :: పొరుగు రాష్ట్రంలో టీడీపీ నేతలపై కనీసం ప్రశంసలు కురిపించని ఏపీ టీడీపీ నేతలు.. ఇప్పుడు ఒక పక్కింటి నేతపై ప్రేమ ఒలక బో స్తున్నారు. ఆయ నతో సాన్నిహిత్యం కోసం తెగ ఆరాట పడుతున్నారు. సొంత పార్టీ నేతల కంటే ఎక్కువగా.. ఆ నేతే మాకు ఎక్కువని చెప్పకనే చెబు తున్నారు!!తెలం గాణ సీఎం కేసీఆర్ పై ఏపీ టీడీపీ నేతల వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాయి.మొన్నటికి మొన్న పరిటాల శ్రీరామ్ పెళ్లికి వచ్చిన కే సీఆర్ కు ఆహ్వానం పలికేందుకు ఆయనతో మాట్లాడేందుకు ఏపీ టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించడం తెలిసిందే!ఇక ప య్యావుల కేశవ్ వంటి సీనియర్ నేతలు ఆయనతో రహస్యంగా భేటీ అవడం ఎంతటి దుమారం రేపిందో వేరేగా ప్రస్తావించనవసరం లేదు. గతం లో నూ కేసీఆర్ ఏపీకి వచ్చిన సందర్భంలో నేతల తీరు వివాదాస్పదమైంది!!చివరికి వీరి వ్యవహార శైలి టీటీడీపీ తరఫున ఒంటరిగా పోరాడుతున్న రే వంత్ రెడ్డి నొచ్చుకునేలా చే సింది.ఇదే సమయంలో ఏపీ నేతల తీరును రేవంత్ ఎండగట్టినా.. దానికి సమాధానం చెప్పలేని నేతలు మరోసారి కే సీఆర్ ను భుజాన కెత్తుకుని మోసేందుకు ప్రయత్నించారు.ఏపీ ఉప ముఖ్యమంత్రి – రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి తాజాగా కేసీఆర్ ను ప్రశం సలతో ముంచెత్తారు.ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో మేలు అని కితాబిచ్చారు.
చంద్రన్న గూటిలో కేసీఆర్ ఫ్యాన్స్
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి