బాబుతో కొత్త వివాదానికి వ‌ర్మ ప్లాన్

కొత్త వివాదానికి వ‌ర్మ క‌త్తులు నూరుతున్నాడు
ఈసారి సీన్‌లోకి ఏపీ సీఎం చంద్ర‌బాబుని లాగేట్టు ఉన్నాడు
ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కోసం వ‌ర్మ మ‌రో సంచ‌ల‌న న‌టుడిని ఎంపిక‌చేశాడు
అత‌డే జేడీ చ‌క్ర‌వ‌ర్తి.
ఎప్పుడూ గడ్డంతో ఉండే జేడీ చంద్రబాబు పాత్రకు బాగా సూటవుతాడని.. ఈ పాత్రకు తగ్గట్లుగా అతణ్ని మౌల్డ్ చేసుకోవడం ఈజీ అని వర్మ భావి స్తున్నాడని టాక్‌. ఈ పాత్ర చేసేందుకు వేరే నటులు ముందుకు రావడం కష్టమే. ఐతే వర్మ లాగే సంచలనాలకు అలవాటు పడ్డ జేడీ.. తనకు లైఫ్ ఇచ్చిన వర్మ కోసం ఈ పాత్ర చేయడానికి ముందుకొచ్చాడని స‌మాచారం. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కాస్టింగ్ సంగతి చూస్తూనే నాగార్జునతో చేయాల్సిన సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా ప‌ర్య‌వేక్షిస్తున్నాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదికి వెళ్తుంది. ఇక ఈ సినిమాలో చంద్ర‌బాబు పాత్ర‌ని ఏ విధంగా తీర్చిదిద్దాడు అన్న‌దే ఆస‌క్తిదాయ‌కం కానుంది.మ‌రోవైపు చంద్ర‌బాబు మాత్రం ఈ సినిమాపై అప్పుడే ఎటువంటి కామెంట్లు చేయ‌వ‌ద్ద‌ని తెలుగు త‌మ్ముళ్ల‌కు వార్న్ చేశారు. ఎన్టీఆర్ జీవితం గురించి అంద‌రికీ తెలుసు అని, ఆ చ‌రిత్ర పురుషుడి జీవితం త‌ప్పులుత‌డ‌క‌లుగా తెర‌కెక్కిస్తే అటువంటి సినిమాలు జ‌నం ఆద‌రించర‌ని బాబు వెల్ల‌డించిన అభిప్రాయం.

Leave a comment