వెండితెరని శాసించాడు
బుల్లితెరనీ శాసించాడు
బాహుబలి మరో రికార్డు సాధించాడు
అత్యధిక వీక్షకులున్న సినిమాగా బుల్లి తెర పై సరికొత్త చరిత్ర లిఖించాడు.
వివరాలిలా.. : ‘మరో మైలురాయి దాటిన ‘బాహుబలి’. బుల్లితెర ప్రీమియర్‌లో అత్యధికంగా వీక్షించిన హిందీ సినిమాగా కొత్త రికార్డు సృష్టించింది. జై మాహిష్మతి’ అని ట్వీట్ చేసింది ఆ చిత్ర బృందం.వెండితెరపై మాయ చేసిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ బుల్లితెరనూ వదలలేదు. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం బుల్లితెరపై కూడా అలాంటి మ్యాజిక్ చేసింది. అక్టోబరు 8న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ టెలివి జన్ ప్రీమియర్‌ను ప్రసారం చేశారు.కాగా బుల్లితెరపై అత్యధికంగా వీక్షించిన హిందీ సినిమాగా ఈ చిత్రం తొలిస్థానం దక్కించుకుని సరికొత్త రికార్డు నమోదుచేసింది. దీని తర్వాతి స్థానంలో సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్‌లైట్’ నిలిచింది. కానీ ఈ రెండు చిత్రాల వీక్షకుల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం విశేషం. ‘ట్యూబ్‌లైట్’ను బుల్లితెరపై చూసిన వారి సంఖ్య కన్నా, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ను చూసిన వారి సంఖ్య ఐదు రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం.అక్టోబరు 7 నుంచి 13 వరకు ప్రసారం అయిన షోల సమాచారాన్ని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీఏ ఆర్‌సీ (బార్క్)) విడుదల చేసి, బాహుబలి – 2 వ్యూయర్ షిప్ గురించి పేర్కొంది.ఏదైతేనేం తెలుగింట పుట్టిన ఈ కథ అటు ఉత్తరాదిని అమితంగా ఆకట్టుకోవడం ఓఅరుదైన విషయం. మనవి సాంబారు కథలుగా పెదవి విరిచే ఉత్తరాది సినీ వర్గాలకు ఇది ఓ విధంగా షాక్.