ఫ్యాష‌న్ ప‌రేడ్ న్యూలుక్స్‌లో అర్జున్ రెడ్డి అదుర్స్

నేను కానీ లుంగీ కానీ క‌ట్టానంటే అని అంటూ కుర్ర‌కారుని ఉర్రూతలూగిస్తున్నాడు అర్జున్ రెడ్డి ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ. ఒక్క సినిమాతో యూత్ లో ఎన‌లేని క్రేజ్ కొట్టేసిన ఈ యువ హీరో ఇటీవ‌ల అన్ని ఫంక్ష‌న్ల‌లోనూ ప్ర‌ముఖంగా క‌నిపిస్తూ కెమెరా కంటికి చిక్కుతున్నాడు.కొన్ని సంద‌ర్భాల్లో ఆస‌క్తిదాయ‌క వ్యాఖ్య‌లు చేస్తూ మీడియాకు హాట్ టాపిక్ అవుతున్నాడు.

దీంతో ఈ  కుర్రాడి ప్ర‌తి క‌ద‌లికా సెన్సేషన్ అవుతోంది. విజయ్ ప్రతీ మూవ్మెంట్ గురించీ జనాలు ఆరా తీస్తున్నారు.. మాట్లాడుకుంటున్నారు.నెటిజ‌నులు సైతం అర్జున్ రెడ్డి అప్ డేట్స్ పై తెగ ఉత్సాహం చూపుతున్నా రు. అంతేనా విజయ్ దేవరకొండ ఫ్యాషన్ హాట్ టాపిక్.ప్రత్యేకించి చేనేత వస్త్రాలతో కూడిన డ్రెసింగ్స్ ను ఫొటోషూట్స్ కోసం ఎక్కువగా వినియోగిస్తూ జనం దృష్టిని ఆక‌ట్టుకుంటున్నాడు. ఒక్కో చోట ఒక్కో లుక్.. మార్చి మార్చి మెస్మరైజ్ చేసేస్తూ షాక్ లు ఇచ్చేస్తున్నాడు.మొత్తానికి మ‌నోడి క్రేజ్ ఇంకా ఏ రేంజ్‌కి చేరుకునుందో ముంద‌న్న కాల‌మే చెప్పాలిక‌!

 

Leave a comment