కొంచెం కష్టం
కొంచెం ఇష్టం
డబ్బులు పోయి కష్టం
నిర్మాతగా సక్సెస్ అయితే ఇంకా ఇష్టం
ఇదీ దిల్ రాజు కథ.
టాలీవుడ్ షెహన్ షా దిల్ రాజు నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.తనదైన డైనమిజం చాటుతున్నారు.అదే సమయంలో అ పజయాలూ పలకరిస్తున్నాయి. ఓ డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన కోల్పోయిందెంతో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఈ ఏడాది నమో వెంకటేశాయ మొదలుకొని స్పైడర్ సినిమా దాకా ఆయన పోగొట్టుకున్న మొత్తం 30 కోట్ల రూపాయలు. నిర్మాతగా ఆర్జించింది 80 కోట్లు. అయినా దిల్ రాజు వెనకడుగు వేయడం లేదు. వరుస సినిమాలు కమిట్ చేసుకుంటూ పోతున్నారు.మహేష్ బాబు-వంశీ పైడిపల్లి, నాని-వేణు శ్రీరామ్, రాజ్ తరుణ్-అనీష్, నిఖిల్-చందు మొండేటి ప్రాజెక్టులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఇవి కాక మరికొన్ని క్రేజీ కాంబినేషన్లు కూడా ఓకే కానున్నాయని టాక్.ఇప్పటి దాకా దిల్ రాజు ఐదు సినిమాలు నిర్మిస్తే.. అందులో ఒక్క ఫిదా సినిమానే నైజాం ఏరియాలో 18 కోట్లు వసూలు చేసి బంపర్ బొనాంజాని అందించింది.
ఇక శతమానం భవతి, నేను లోకల్ సినిమాలను నైజాం, వైజాగ్ ఏరియాలు తానే పంపిణీ చేయడంతో ఆర్థికంగా ఆయన బాగా కుదుటపడ్డారు. నిన్నటి డిజె, నేటి రాజా ది గ్రేట్ సినిమాలు కూడా బాగానే కలిసొచ్చాయి.త్వరలో ఆయన బ్యానర్ నుంచి సాయి ధరమ్ తేజ హీరోగా జవాన్ విడుదల కానుంది. ఈ సినిమాని రైటర్ బీవీఎస్ రవి డైరెక్ట్ చేశారు.కానీ ఔట్ పుట్ అంతగా ఆశించినంత మేర లేక పోవడంతో రైటర్ కమ్ డైరెక్టర్ కొరటాల శివ సూచనలు మేరకు ద్వితీయార్థంలో పలు మార్పులూ చేర్పులూ చేస్తున్నారని టీ టౌన్ టాక్. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా దిల్ రాజు నిర్మాతగా సక్సెస్, డిస్ట్రిబ్యూటర్ గా ఫెయిల్యూర్‌ని మూటగట్టుకున్నారీ ఏడాది. ఒక్కమాటలో గెలుపోట ములకు అతీతంగా టాలీవుడ్ బాద్ షా అనిపించుకున్నారు..అన్నది ఇండస్ట్రీ పెద్దల ప్రశంస.