Gossipsముద్దు అడిగితే మీడియాపై ఫైర్ అయిన ఆ హీరోయిన్ ఎవరో తెలుస్తే...

ముద్దు అడిగితే మీడియాపై ఫైర్ అయిన ఆ హీరోయిన్ ఎవరో తెలుస్తే షాకే !

అధ‌రాలు మాట్లాడుకుంటే దానిని ముద్దు అని ..

రెండు హృద‌యాలు మాట్లాడుకుంటే దానిని ప్రేమ అని..

రెండు శ‌రీరాలు మాట్లాడుకుంటే దానిని రొమాన్స్ అని..

ఇలా ర‌క‌ర‌కాలుగా నిర్వ‌చ‌న‌లున్నాయ్‌. కానీ ఈ పిల్ల మాత్రం

ముద్దు గురించి అడిగితేనే క‌ళ్లింత‌లు చేసింది.పుసుక్కున ఫీలైపోయింది.

మీడియాపై ఫైర్ అయిపోయింది.. కూడా!

ఏం జ‌రిగిందంటే :: ”మీరెవ్వరూ ఎప్పుడూ, ఎవరికీ ముద్దు పెట్టలేదా! మీకసలు ముద్దు అంటేనే తెలియదా? మీ ఇళ్లలో భార్యాభర్తలు ముద్దులు పెట్టుకోరా? ప్రేమగా ఉండరా?” అంటూ ముద్దు గురించి ఓ పెద్ద ఉపన్యాసమే ఇచ్చింది త‌మిళ నాయ‌కి ఆండ్రియా. సిద్ధార్థ్‌తో ఆమె నటించిన గృహం చిత్రం వ‌చ్చే నెల మూడున విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర విశేషాల‌ను మీడియాతో పంచుకుంది. మాటల సంద‌ర్భంగా అధ‌ర చుంబ‌న దృశ్యాల గురించి అడిగిన మీడియాపై ఫైర్ అయ్యింది.టెక్నాలజీ డెవలప్ అయిన నేటి రోజుల్లో కూడా.. ముద్దు గురించి అడుగుతున్నారేంటి? అని ఎదురు ప్ర‌శ్న ఒక‌టి సంధించింది.. ”ప్రస్తుత ప్రేమ ప్రపంచం ఎలా ఉందో తెలియదా? పబ్లిక్‌గా, పార్క్‌లలో ముద్దులు పెట్టుకోవడం లేదా?” అంటూ ముద్దు గురించి మరోమాట మాట్లాడ‌నివ్వ‌లేదు. అంత‌లా కౌంట‌ర్ ఎటాక్ ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ‌.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news