వీ 4 పేరు వినేందుకే కొత్తగా ఉంది కదూ! కేవలం కాన్సెస్ట్ బేస్డ్ సినిమాలు తీసేందుకే ఈ బ్యానర్‌ని స్టార్ట్ చేశారట మెగా ప్రొడ్యూసర్ అల్లూ అరవింద్.ఇప్పటికే గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తూ వరుస సక్సెస్‌లతో ఉన్న ఆయన తాజాగా గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ భాగస్వాములుగా చేసుకుని కొత్త నిర్మాణ సంస్థని నెలకొల్పారు.
ఈ సంస్థలో మొట్టమొదటి సినిమాను హీరో ఆది తో తీస్తున్నారు. హర్రర్-కామెడీ నేపథ్యంలో నెక్స్ట్ నువ్వే అనే ఆ సినిమాను ఒకనాటి ఈటీవీ ఫేం ప్రభాకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. కొత్తగా టాలెంట్ ను ప్రోత్సహించడం కోసమే వి4 ని సృష్టించామన్నారు.
తమిళ్ లో ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంది.అదేవిధంగా తెలుగులో కూడా ఇక నుంచి అలాంటి చిత్రాలు నిర్మించి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసేందుకే తామీ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పామని తెలిపారు.గతంలో అల్లూ అరవింద్ అశ్వనీదత్ తోనూ, రాఘవేంద్రరావుతోనూ నిర్మాణ భాగస్వామిగా వ్యవహ రించి గంగోత్రీ సినిమా తీశారు.అదేవిధంగా వీ4లో నిర్మాణ భాగస్వామిగా ఉన్న గీతా ఆర్ట్స్ 2 పేరిట ఓ సీక్వెల్ బ్యానర్‌ని బన్నీ వాసు నడుపుతూ వరుస విజయాలు అందుకుంటున్నారు.
స్టూడియో గ్రీన్ కూడా తమిళ్ హీరోలు సూర్య, కార్తి నటించిన చిత్రాలను తెలుగులో విడుదల చేసి, ఇక్కడి మార్కెట్ పై పట్టుపెంచుకుంది.మరో నిర్మాణ భాగస్వామి యూవీ క్రియేషన్స్ ( అధినేతలు : వంశీ -ప్రమోద్) కూడా సక్సెస్ ట్రాక్ లోనే ఉన్నారు. ఇలా అగ్ర నిర్మాణ సంస్థలన్నీ ఒకే గొడుగు కిందకి వచ్చి ఏర్పాటుచేసిన ఈ వీ4 ప్రొడక్షన్ హౌస్ వినూత్న చిత్రాలకు కేరాఫ్ కావాలని ఆశిద్దాం.