గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది హిట్లు తరువాత పవన్ కెరియర్ కి కలిసొచ్చే చిత్రం ఒక్కటీ రాలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ , కాటమ రాయుడు చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా, అంతకుముందు విడుదలైన గోపాల గోపాల యావరేజ్ గా నిలిచింది.ఈ సారి మళ్లీ త్రివిక్రమ్ తో కలిసి పనిచేస్తున్నారాయన.తాజాగా పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ని ఫిల్మ్ ఛాంబర్లో యూనిట్ రిజిష్టర్ చేయించడమే ఆలస్యం..అప్పుడే స్టోరీ కూడా లీక్ అయిపోయింది.
వేలకోట్ల ఆస్తిపరుడైన హీరో తన ఐడెంటిటీని వదిలేసి కొంతకాలం అజ్ఞాతవాసం చేయడమే ఈ సినిమా కథ అని ప్రచారం జరుగుతోంది. బాగా రిచ్ అయినప్పటికీ పవన్ ఎందుకు అజ్ఞాతవాసం చేస్తాడనే అంశం చుట్టే స్టోరీ అల్లుకుని వుంటుందంటున్నారు. ఒక విధంగా చూస్తే.. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో తన అత్తకోసం అన్ని వదిలేసి ఏమీ లేనోడిగా నటించే కాన్సెప్ట్లాగే ‘పీకే 25’ కథ వున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే.. ఈ సినిమా కథ మీదున్న నమ్మకం వల్లే నిర్మాత ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ ఖర్చు పెడుతున్నాడట. సంక్రాంతికి రానున్న ఈ చిత్రం ఫ్యాన్స్‌కే కాకుండా ఆడియెన్స్‌ని అలరిస్తుందని, ఈ చిత్రం పవన్ కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొంటున్నారు.వచ్చే ఏడాది జనవరి 10న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.