అదిరింది.. ఆగిపోయింది! రీజన్ ఇదే…

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా అత్లీ డైరక్షన్ లో వచ్చిన సినిమా మెర్సల్. తమిళ నాట రిలీజ్ అయిన నాటి నుండి ఓ పక్క వసూళ్ల రికార్డులు మాత్రమే కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టేసరికి రాజకీయంగా కూడా ఈ సినిమా సంచలనంగా మారింది. అక్కడ వేడి అలా ఉండగా తెలుగులో ఆ సినిమా రిలీజ్ చేయాలని చూశారు కాని అది కుదరలేదు.

వారం తర్వాత అంటే ఈరోజు ఇక్కడ మెర్సల్ తెలుగు వర్షన్ అదిరింది రిలీజ్ చేద్దామని చూసినా ముందు రోజు దాకా సెన్సార్ క్లియరెన్స్ ప్రాబ్లెం కాగా నైట్ కు నైట్ సెన్సార్ వచ్చినా సరే సినిమా మాత్రం రిలీజ్ కాకుండా ఆపేశారు. రాజకీయ శక్తులే అదిరింది రిలీజ్ కు అడ్డుపడ్డాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో శరత్ మరార్ రిలీజ్ చేస్తున్న ఈ సినిమా మళ్లో వారం పోస్ట్ పోన్ అయ్యిందని అన్నారు. మరి వచ్చే వారం అయినా వస్తుందా అసలు రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

 

Leave a comment