Gossipsరకుల్ రేటుకి నిర్మాతలకు సౌండ్ లేదట..!

రకుల్ రేటుకి నిర్మాతలకు సౌండ్ లేదట..!

సౌత్ లో క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇమేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్ మాత్రమే కాదు కోలీవుడ్ లో కూడా అమ్మడు హవా ఓ రేంజ్ లో కొనసాగుతుంది. వరుస స్టార్స్ తో నటించేస్తున్న అమ్మడు రెమ్యునరేషన్ విషయంలో దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తుందట.

ఈమధ్యనే మహేష్ సరసన తెలుగు తమిళ భాషల్లో వచ్చిన స్పైడర్ లో నటించిన రకుల్ ప్రస్తుతం కార్తి ఖాకి సినిమాలో నటిస్తుంది. ఇక తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో రకుల్ ఇప్పుడు రెమ్యునరేషన్ పెంచేసిందట. రకుల్ తో సినిమా అంటే ఇప్పుడు 2 కోట్లు ఉంటేనే అని డిమాండ్ చేస్తుందట.

టాలీవుడ్ లో లీడింగ్ యాక్ట్రెస్ అంతా వెనక్కి తగ్గడంతో అనతికాలంలోనే రకుల్ స్టార్ క్రేజ్ దక్కించుకుంది. కోలీవుడ్ టాలీవుడ్ అనే తేడాలేకుండా రకుల్ రెచ్చిపోవడం చూస్తుంటే కొద్దికాలం అమ్మడిని కదిలించే సాహసం చేయలేరని తెలుస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news