తెల్లతోలు పిల్ల తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 12 ఏళ్లు అయిపోయిందట! శ్రీతో ఎంట్రీ ఇచ్చిన ఈ సోయగం అటుపై హ్యాపీ డేస్ తో సక్సెస్ ట్రాక్ పట్టింది. లంగా ఓణీల్లో పద్ధతిగా కనిపించి కుర్రకారు మతిపోగొట్టింది. మొత్తంగా కొందరు సొట్ట బుగ్గలతో అలరిస్తే మరికొందరు అందమైన చిరునవ్వు తో ఆకర్షిస్తే తమన్నా మాత్రం తన స్కిన్ టోన్తోనే తెగ ఆకట్టుకుంటోంది.తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను తెచ్చుకుంది.
జయాపజయాల తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. అటు ఐటం భామ గానూ ఇటు హీరోయిన్ గానూ రాణిస్తూ సత్తాచాటుతోంది.నటనకు ప్రాధాన్యం ఇస్తూనే అవసరమైతే గ్లామర్ షోకీ సై అంటోంది. బాహుబలి లాంటి క్రేజీ ప్రాజెక్టులు మొదలుకొని అల్లుడు శీను లాంటి అప్ కమింగ్ స్టార్ లతోనూ చిందులేస్తూ తన పరిధిని విస్తృతం చేసుకుంటోంది.జయాపజయాలనేవి మన చేతుల్లో లేనివి అని, అంతా దేవుడు రాత అని అంటోంది తమన్నా. ”ఎన్ని సినిమాలు చేసినా హ్యాపీ డేస్ నాకు ఇప్పటికీ ఎప్పటికీ స్పెషల్.
ఆ తర్వాత తమిళ్ లో కార్తీ తో కలిసి నటించిన పయ్యా సినిమా నాకు మంచి ఎనర్జీని ఇచ్చింది. తెలుగు, తమిళం ఇలా ఇరు భాషల సినీ ప్రేమికులనీ అలరించింది. ఇక 100% లవ్ నాకు నటిగా మంచి గుర్తింపు తెచ్చింది. ఇక ఊపిరి సినిమా కూడా నాకు మర్చిపోలేని ఒక జ్ఞాపకం” అన్నది ఈ ముంబై సోయగం అభిప్రాయం. బీ టౌన్ కి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా పెద్దగా ఫలితం లేక నెగ్గుకు రాలేకపోయింది. కానీ ఈ పన్నెండేళ్ల కాలంలో ఇటు తెలుగు, అటు తమిళ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేనా వివాదరహితురాలిగానూ గుర్తింపుతెచ్చుకుంది.