సూపర్ స్టార్ మహేష్ తమిళ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. తెలుగు తమిళ భాషల్లో దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. ఇక కొద్దిసేపటి క్రితం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అనుకున్నట్టుగానే సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది.
ఇక సినిమా మహేష్ చరిష్మాను తప్పక తెలియచేస్తుందని అంటున్నారు. మురుగదాస్ టేకింగ్ సినిమాకు హైలెట్ అవనుందట. సినిమా నిడివి 2 గంటల 25 నిమిషాలు ఉంటుందని తెలుస్తుంది. విలన్ గా నటించిన సూర్య సైకోగా కనిపిస్తాడట. మురుగదాస్ అన్ని సినిమాల్లో లానే స్పైడర్ కూడా భారీతనంతో ఉంటుందట. సెన్సార్ నుండి ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన స్పైడర్ కు హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాతో మహేష్ మొదటిసారి తమిళ మార్కెట్లోకి దిగుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.