రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన స్పైడర్ కు హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాతో మహేష్ మొదటిసారి తమిళ మార్కెట్లోకి దిగుతున్నాడు.ఈ వారం విడుదల కాబోతున్న ‘స్పైడర్’ మూవీ కథ పై ఇప్పటికే రకరకాల కథనాలు ఊహాగానాలుగా ప్రచారంలోకి వస్తున్నాయి. దీనితో ఈసినిమా కథ పై మహేష్ అభిమానులలో కూడ కొంత గందరగోళం ఉంది.
ఈ పరిస్థుతుల నేపధ్యంలో ‘స్పైడర్’ మూవీని ప్రమోట్ చేస్తూ మురగదాస్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు మహేష్ అభిమానులను మరింత గందరగోళంలో పడేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం ‘ఒకటి, రెండు రూపాయలకే వైద్యం చేసి, ఆనందపడే డాక్టర్లను ప్రత్యక్షంగా చూసాను. సామాజిక సేవతో సంతృప్తి పొందేవాళ్ళను చూసాను. వాళ్ళల్లో ఉన్న మానవత్వం నాకు నచ్చింది. ఈ కధ రాయడానికి అదే ప్రేరణ’ అని అంటున్నాడు మురగదాస్.
ఏ విషయంలో అయినా వేగంగా ఉండొచ్చు కానీ అమ్మ, నాన్న, స్నేహితులు, బంధువులను ప్రేమించలేనంత తీరికలేకుండా ఉండకూడదు అని అంటూ రానురాను మానవత్వం అనేది తగ్గిపోతోంది అంటూ షాకింగ్ కామెంట్ చేసాడు మురగదాస్.
అందరూ సంతోషంగా ఉండాలనుకునే క్యారెక్టర్ లో కూల్ గా సీరియస్ గా ఉంటాడు అని చెపుతూ “స్పైడర్” సినిమా కధ మానవత్వం తో మిళితమైంది అన్న విషయాలను బయట పెడుతున్నాడు. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలను నేటి తరం ప్రేక్షకులకు నచ్చేవిధంగా మురగదాస్ చెప్పలేకపోతే ‘స్పైడర్’ కు ఊహించిన స్థాయిలో విజయం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అని మహేష్ అభిమానులు భయపడుతున్నట్లు టాక్..