టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు కెరీర్‌లోనే ఫస్ట్ టైం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న థియేటర్లలోకి దిగుతోంది. ఇక ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో సినిమా ఎలా ఉంటుందా ? అన్న ఆసక్తి కోట్లాది మంది సినీ అభిమానుల్లో నెలకొంది
స్పైడర్‌ను వరల్డ్‌వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సెన్సార్ రిపోర్ట్ యూ / ఏ రిపోర్ట్ ఇచ్చింది. రన్ టైం 145 నిమిషాలు. ఇక సెన్సార్ & స్పైడర్ సినిమాపై టాలీవుడ్ ఇన్సర్ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం స్పైడర్ ఫస్టాఫ్ ఆసక్తికరమైన ఇంటిలిజెంట్ గేమ్‌తో నడుస్తుందట. విలన్ దేశాన్ని నాశనం చేసేందుకు వేసే ఎత్తులను హీరో ఎదుర్కొనే సన్నివేశాలు ఫస్టాఫ్‌లో ఉంటాయట. ఫస్టాఫ్ మొత్తం ఆసక్తికరమైన నవల చదువుతుంటే ఎలా పుస్తకానికి అతుక్కుపోతామో ప్రేక్షకులు స్క్రీన్‌కు అలాగే అతుక్కుపోతారట.
ఇక సెకండాఫ్‌లో మురుగదాస్ ఎక్కువుగా ఎమోషనల్ సీన్లకు పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు ప్రత్యేకంగా మహిళా ప్రేక్షకుల కోసమే అన్నట్టు ఉంటాయట. ఓవరాల్‌గా స్పైడర్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా స్పైడర్. ఇక మురుగదాస్ తన సినిమాల్లో ఎప్పుడూ మిస్ కాకుండా ఉండే ఎమోషన్‌ను స్పైడర్‌లో బాగానే ఎలివేట్ చేశారని తెలుస్తోంది.