దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర గురించి అందరి తెలిసిందే. ఆ సినిమా సృష్టించిన సంచలనాలు వసూళు చేసిన కలక్షన్స్ అన్ని అప్పటిదాకా తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులన్ని క్లియర్ చేసింది. అయితే మగధీర పార్ట్-2 పై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కథ అక్కడితో ముగించినా దాన్ని స్టార్ట్ చేయాలంటే అదేమంత పెద్ద కష్టం కాదు రాజమౌళి, రచయిత విజయేంద్ర ప్రసాద్ లకు.
ఇక ఈమధ్య రాజమౌళి, చరణ్ ల సాన్నిహిత్యం చూసి మగధీర-2 తెర మీదకు రాబోతుందని అనుకున్నారు. ఇక ఈ వార్తలకు స్పందిస్తూ మగధీర 2 పై తన స్పందన తెలియచేశారు రచయిత దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. ఆయన దర్సకత్వంలో వస్తున్నా శ్రీవల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చరణ్ గెస్ట్ గా వచ్చారు. చరణ్ గురించి మాట్లాడుతూ మగధీర సీక్వల్ పై వచ్చిన వార్తలకు సమాధానం ఇచ్చారు. మగధీర-2 ఉంటుందో లేదో కాని చిరంజీవి, రాం చరణ్ లను కలిపి ఓ సినిమా మాత్రం ఉంటుంది. అది మగధీరను మించిన సినిమా అవుతుందని అన్నారు.
ఇక మగధీర లోని ఒక్కొక్కడు కాదు షేర్ ఖాన్ అన్న డైలాగ్ అది చరణ్ కోసం రాసుకుంది కాదని.. సింహాద్రి హిట్ తర్వాత చిరంజీవి రాజమౌళి సినిమా అనుకున్నాం కాని అది కుదరలేదు. ఆ సినిమాలో ఈ సీన్ పెట్టాలని భావించాం కాని అది కుదరక చరణ్ మగధీరలో ఆ సీన్ పెట్టామని ఓ అద్భుతమైన విషయాన్ని వెళ్లడించారు విజయేంద్ర ప్రసాద్. మరి ఆయన అన్నట్టు రాజమౌళి డైరక్షన్ లో చరణ్ , చిరు కలిసి చేస్తే ఇక ఆ సినిమా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుందని చెప్పొచ్చు.