దర్శకధీరుడు రాజమౌళి మంచితనం గురించి అందరికి తెలిసిందే. పరిశ్రమలో ఆయన మంచిని వాడుకుని తాము చేస్తున్న సినిమాకు క్రేజ్ తీసుకురావాలని అందరు తెగ ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో జక్కన్నను ఎలా వాడాలో అదే రేంజ్ లో వాడేస్తుంటారు. ఇక రాజమౌళి వాడటంలో వారాహి చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటి ముందుంటాడు.
ఆడియో దగ్గర నుండి సినిమా రిలీజ్ అయ్యే దాకా రాజమౌళి సపోర్ట్ తీసుకుంటాడు. ఏదో తన ఆలోచనను నమ్మి ఈగకు ప్రొడ్యూస్ చేసినందుకు రాజమౌళి అతని నిర్మాణంలో ఏ సినిమా వచ్చినా సరే కాదనకుండా ప్రమోట్ చేస్తాడు. అయితే ఇదే రాజమౌళి ఇమేజ్ కు బ్యాడ్ నేమ్ తెచ్చిపెడుతుంది. వారాహి బ్యానర్లో వచ్చిన పటేల్ సార్ లాంటి సినిమాలు కూడా రాజమౌళి పొగడటంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి తీరా సినిమా చూస్తే మాత్రం రిజల్ట్ వేరేలా ఉంది.
సినిమాలో దమ్ము లేనిది రాజమౌళి మాట మాత్రం ఏం చేస్తుంది.. అలానే రీసెంట్ గా రిలీజ్ అయిన యుద్ధం శరణం కూడా ఫ్లాప్ లిస్ట్ లో చేరింది. దీనికి రాజమౌళి సపొర్ట్ అందించకపోవడం ఒకరకంగా తనని సేవ్ చేసిందనే చెప్పాలి. ఒకవేళ జక్కన్న దీనిని ప్రమోట్ చేసి ఉంటే కచ్చితంగా దీని ఎఫెక్ట్ కూడా రాజమౌళి మీద పడేదని తెలుస్తుంది. మరి ఎంత దగ్గర వారైనా సరే సినిమా రాజమౌళి చెప్పడానికి కొంత రేంజ్ అంటూ ఉండాలని మాత్రం అర్ధం చేసుకోవాలి.