ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ బాక్స్ ఆఫీస్ వద్ద భీబత్సం సృష్టిస్తుంది . త్రిపాత్రాభినయంతో నట విశ్వరూపం చూపిన ఎన్టీఆర్’పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కేవలం 2 రోజుల్లో 80 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఈ చిత్రం.
ఈ విజయాన్ని తారక్ ఎంజాయ్ చేస్తున్నాడు. “జై లవ కుశ’ నటుడిగా ఎంతో సంతృప్తి ఇచ్చింది. ఇంతకంటే తనకు ఏం కావాలి. ఈ పాత్రలు నటించే అవకాశం ఇచ్చిన జై లవ కుశ చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు ” అంటూ ట్విట్ చేశాడు ఎన్టీఆర్.
టీవీ చానెల్ కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూ లో ఏఈ విజయం ఈ ఒక్కడిదో కాదని ,ఇది సమిష్ట కృషి అని అన్నారు. దర్శకుడు బాబీ ప్రతిభను గురించి వివరించారు ఎన్టీఆర్.
సినిమాలో మూడు పాత్రల్లో జై పాత్ర బాగా వచ్చింది. ఆ పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతం. ఫస్టాఫ్ లో కామెడీ, ప్రీ-క్లైమాక్స్ లో నాటకం ఏపీసోడ్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ప్రేక్షకుడు సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయనే ఆలోచన రాకుండా ఫోకస్ అంతా ఎన్టీఆర్ పైనా పెట్టేలా సినిమా ఉంది. తెరపై ముగ్గురు ఎన్ టీఆర్ లని చూసి నందమూరి అభిమానులు పండగ చేసుకొంటున్నారు.