యంగ్‌హీరో శర్వానంద్ తన సినిమాలతో పదే పదే పెద్ద హీరోలకు పోటీగా తన సినిమాలు రిలీజ్ చేస్తూ హిట్లు కొడుతున్నాడు.ఈ ఏడాది సంక్రాంతి పండగకు విడుదలైన మూడు సినిమాలు విజయబావుటా ఎగురవేసిన తెలిసిందే. బాలయ్య, చిరులతో పాటు శర్వానంద్ కూడా ‘శతమానం భవతి’ ద్వారా బంపర్ హిట్ ను అందుకున్నాడు. దీంతో దసరాకు కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని, ‘జై లవకుశ’ విడుదలకు ముందు సామాన్య ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా భావించాయి. కానీ ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యే అవకాశం లేదన్న విషయం తేలిపోయింది.
ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియర్ల తర్వాత సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో చూద్దాం. పాటలు, టీజర్, ట్రైలర్ అయితే అలాంటి ‘నెగటివ్’ సంకేతాలు ఇవ్వలేదు గానీ, సెంటిమెంట్ ను బలంగా నమ్మే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి సెంటిమెంట్స్ సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే.
ఫస్టాఫ్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు, నాజర్ క్యారెక్టర్, చివరకు శర్వా అతి శుభ్రతతో లేనిపోని కష్టాలు రావడంతో మెహ్రీన్ అతడి ప్రేమకు గుడ్ బై చెపుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ గుడ్.ఇక సెకండాఫ్‌లో హీరోకు – హీరోయిన్ ఫ్యామిలీకి మధ్య వచ్చే కామెడీ సీన్లు మారుతి బాగా ప్రజెంట్ చేశాడు. సినిమాకు థమన్ మ్యూజిక్, కామెడీ చాలా ప్లస్. సినిమా సూపర్ ఫస్టాఫ్, యావరేజ్ సెకండాఫ్‌తో ఓవరాల్‌గా హిట్ అనిపించుకుంది. సినిమాలో మరీ అదిరిపోయే రేంజ్ కామెడీ లేకపోయినా ఓవరాల్‌గా మాత్రం శర్వా ఖాతాలో మరో హిట్ పడినట్టే అని ప్రైమరీ రిపోర్టులు చెపుతున్నాయి.