Gossipsమహానుభావుడు మూవీ రివ్యూ & రేటింగ్

మహానుభావుడు మూవీ రివ్యూ & రేటింగ్

సినిమా : మహానుభావుడు

నటినటులు: శర్వానంద్ , మేహ్రీన్ కౌర్ పిర్జాడ, వెన్నల కిషోర్, నాజర్, జబర్దస్త్ వేణు తదితరులు

దర్శకత్వం: దాసరి మారుతీ

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు

సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ

మ్యూజిక్: తమన్ ఎస్ఎస్

నిర్మాతలు: వంశీ , ప్రమోద్

బ్యానర్ : యువి క్రియేషన్స్

 

తన కెరీర్ బిగినింగ్ లో  యూత్ కి  నచ్చేలా ఈ రోజుల్లో , బస్ స్టాప్ లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ మారుతి.. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో తన క్యాటర్ బేస్డ్ సినిమాలు ,  వినోదాన్ని పంచే కుటుంబ కథా చిత్రాలకు ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కోవలోనే విక్టరీ వెంకటేష్‌‌ ను ‘బాబు బంగారం’గా చూపించారు. అది కాస్త బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఓ వైవిద్యభరితమైన కథతో తాజాగా ‘మహానుభావుడు’ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ మారుతి. శర్వానంద్, మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విశ్లేషణ :

గతంలో మతిమరుపు అనే కాన్సెప్ట్‌తో ‘భలే భలే మగాడివోయ్’ను అందించిన మారుతి.. ఇప్పుడు అతి శుభ్రత (ఓసీడీ) అనే వింత వ్యాధి నేపథ్యంలో ‘మహానుభావుడు’ను తెరకెక్కించారు. హీరో అతి శుభ్రతతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. ఆయన  ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. కామెడీ, లవ్ ట్రాక్‌తో సినిమాను బాగా నడిపించారు. కామెడీ ఇష్టపడే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. కుటుంబ సమేతంగా థియేటర్‌కు వెళ్లి హాయిగా చూసే సినిమా. శర్వానంద్ మరియు మేహ్రీన్ జంట మద్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇద్దరి స్క్రీన్ ప్రజేన్స్ చాలా బాగుంది.

శర్వానంద్, వెన్నెల కిషోర్ మధ్య నడిచే కామెడీ సన్నివేశాలు.. శర్వానంద్, మెహ్రీన్ ప్రేమ కథతో పాటు మూడు సాంగ్స్  కూడా బాగున్నాయి. మొత్తానికి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాతో శర్వానంద్ మరో హిట్ కొట్టేసినట్లే అని చెప్పొచ్చు. భలే భలే మగాడివోయ్ తో చొంపరె చేసే అంత రేంజ్ కాదు కానీ , కొంచం డిఫరెంట్ గానే ఉందని చెప్పాలి . ఈ సినిమా కి నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత ఎక్కడా ఖర్చు కి వెనుకాడలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమా కి ఒక ప్లెజెంట్ లుక్ తీసుకువచ్చాడు. డైరెక్టర్ గా మారుతీ ఈ సినిమా తో మల్లి ట్రాక్ లోకి వచ్చాడు అని చెప్పవచ్చు.

ప్లస్ లు:

శర్వానంద్

హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ

కామెడీ అండ్ లవ్ ట్రాక్

డైలాగులు

ఆకట్టుకొనే పాటలు

నిర్మాణ విలువలు

సినిమాటోగ్రఫీ

మైనస్ లు:

సెకండ్ హాఫ్ లో స్లో నరేషన్

రొటీన్ సీన్లు

ఊహించదగ్గ కధ

చివరగా: మంచి ఫామిలీ ఎంటర్టైనర్

రేటింగ్: 3.25 / 5

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news