స్టోరీ:
జై , లవ , కుశ అనే ముగ్గురు అన్నదమ్ముల మధ్య జరిగే కధే ఈ మన జై లవ కుశ .ఓ బాంబ్ బ్లాస్ట్‌లో ముగ్గురు అన్నదమ్మలు చిన్నప్పుడే విడిపోతారు. 20 సంవత్సరాల తర్వాత కట్ చేస్తే ఈ ముగ్గురిలో లవ చాలా అమాయకుడైన బ్యాంక్ మేనేజర్ . ఇక కుశ దొంగతనాలు చేస్తుంటాడు. ఓ రోజు జరిగిన ప్రమాదంలో లవ, కుశ కలుసుకుంటారు. కుశ బ్యాంక్ మేనేజర్ అయిన లవ ప్లేస్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. అక్కడ కుశ చేష్టలవల్ల లవ ఇబ్బందుల్లో పడతాడు.
జై రావన్ అవతారం ఎత్తి బైరాంపూర్‌లో ప్రజలను శాసించే కింగ్‌గా మారతాడు. మిగిలిన ఇద్దరు బతికే ఉన్నారన్న విషయం తెలుసుకున్న రావన్ వారిని ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేసాతడు. జై అంత క్రూరంగా ఎందుకు మారతాడు అనేదే అసలు కధ.
విశ్లేషణ:
సినిమా ఫస్ట్ హాఫ్ పాత్రలను పరిచయంచేయ్యడం తో మొదలు పెట్టి మంచి ఎంటర్టైనింగా సాగుతింది. మూడు పాత్రలను చాల బాగా ప్రెసెంట్ చేసారు బాబీ . సాంగ్స్ అద్భుతంగా చిత్రీకరించారు . జై పాత్రను ఇంట్రడ్యూస్ చేసిన విధానం వర్ణనాతీతం . లవ , కుశ మధ్య జరిగే కధలో కామెడీ బోర్ అనిపించేంతలో ఇంటర్వెల్ ఎపిసోడ్ తో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు బాబీ . ఓవర్ అల్గా ఫస్ట్ హాఫ్ చాల ఎంటర్టైనింగ్ గ సాగుతింది.
సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొంచం లాగ్ అయ్యినా మూడు పత్రాలు కలిసిన సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి , జై పాత్రలో ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచారు . క్లైమాక్స్ మొత్తం చాలా ఎమోషనల్గా సాగుతింది .
నటీనటుల పెర్పామెన్స్ :
ట్రేలర్ లో తారక్ టేబుల్ ఎక్కిచెప్పాడు ఆడియన్స్ లో తాను మహా నటుడుని అని మంచి పాజిటివ్ రియాక్షన్ ఉందని దానికి ఏమాత్రం తీసిపోలేదు ఈ సినిమాలో అయన చేసిన నటన . దర్శకుడు బాబీ ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టుగా తారక్ కి నేషనల్ అవార్డు వచ్చే శాతం ఎక్కువగానే కనబడుతుంది. జై పాత్రలో అయన చేసిన నటన వర్ణనాతీతం అంటే మిగిలిన రెండు పాత్రలు బాలేదు అని కాదు . మూడు పాత్రలకు బాగా వేరియేషన్స్ చూపించారు తన నటనతో ఎన్టీఆర్ . హేరియన్లు గ రాసి, నివేద ఇద్దరు వారి పరిధిలో బనే చేసారు . ఇక స్వింగ్ జరా ఐటెం సాంగ్‌లో తమన్నా డ్యాన్సుతో ఓ ఊపు ఊపేసింది. విలన్‌గా రోనిత్‌రాయ్ పాత్రకు న్యాయం చేశారు. జై కి సహాయకుడిగా సాయికుమార్ మెప్పించారు అనే చెప్పాలి.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్:
కదా పరంగా కొత్తదనం ఏమిలేకపోయిన కధనం , మాటలతో మెస్మరైజ్ చేసాడు దర్శకుడు బాబీ . దేవీ అందించిన మ్యూజిక్ , బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ గ నిలిచాయి. సినిమాటోగ్రఫీ , VFX సినిమాను అద్భుతంగ ఎలేవేటే చేసాయి . ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గ అనిపించాయి . మొత్తానికి ఎన్టీఆర్ కి మరో వైపు చూపించినందుకు బాబీని పొగడకుండా ఉండలేం.
బాబి డైరెక్షన్ కట్స్:
ఇక ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉండడం వాళ్లలో ఒకరి ప్లేస్‌లోకి మరొకరు ఎంట్రీ ఇవ్వడం లాంటి సినిమాలు మనం గతంలోనే చాలా చూశాం. రొటీన్ ఫార్మాట్ కథనే తీసుకున్న బాబి ఈ కథను తెరమీద చెప్పే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. ఎక్కడా ప్రేక్షకుడు కన్‌ఫ్యూజ్ కాకుండా ప్రజెంట్ చేశాడు. సాధారణ కథను తెరమీదకు తీసుకురావడంలో బాబికి మంచి మార్కులే పడ్డాయి. హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాల్లో అతడి ప్రతిభ కనపడుతుంది.