యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వచ్చిన సినిమా జై లవ కుశ సినిమాతో బాక్సాఫీస్ పై తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు ఎన్.టి.ఆర్. సినిమాలో జై పాత్రలో ఎన్.టి.ఆర్ తన నట విశ్వరూపం చూపించాడని చెప్పాలి. అయితే దర్శకుడు బాబి మాత్రం ఇంకా సినిమా రేంజ్ పెంచలేకపోయాడని అనుకుంటున్న టాక్. హీరో ఎలివేషన్ సీన్స్ లో బాబి సరైన సీన్స్ రాసుకోలేదని.. జై పాత్ర మీద కూడా ఇంకా బలమైన సీన్స్ రాసుంటే బాగుండేది అని అంటున్నారు.
పవర్ తో సత్తా చాటిన బాబి ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో పొరపాట్లు చేశాడు. ఆ సినిమా ఫలితం బాబి ఎకౌంట్ లో రాకున్నా సరే ఎన్.టి.ఆర్ పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. అయితే బాబి ఆ అవకాశం సరిగా వాడుకోలేదు అన్నది అందరు అంటున్నమాట. ఇదే సినిమా సరైన దర్శకుడి చేతిలో పడితే దీని లెక్క మరోలా ఉండేదని అంటున్నారు. ఇప్పుడు కేవలం ఫ్యాన్స్ మాత్రమే మెచ్చేలా చేస్తున్న ఈ సినిమా సినిమా అభిమానులను కూడా ఆకట్టుకునేదని అంటున్నారు.
ఏది ఏమైనా బాబి మాత్రం ఇద్దరు స్టార్స్ ఇచ్చిన అవకాశాలను సరిగా వాడుకోలేదని తెలుస్తుంది. అందుకే ఇక స్టార్స్ ఎవరు బాబికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉండదని అంటున్నారు. మరి తన మీద వస్తున్న ఈ కామెంట్స్ కు సమాధానంగా బాబి తన తర్వాత సినిమా ఎవరితో చేస్తాడో చూడాలి.