‘బిగ్ బాస్’ సీజన్ 1ను అద్భుతంగా పండించడంలో ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ నూటికి నూరు శాతం సక్సెస్ సాధించాడు. ఇప్పుడీ షో పూర్తయిపోయింది. శివబాలాజీ చివరకు విజేతగా నిలిచి 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ఎన్టీఆర్ చెప్పిన పలు మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పుడీ షో పూర్తయిపోవడంతో.. తాను మా టీవీని.. వీకెండ్స్ లో అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని కోల్పోతున్నానని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు. ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షోకు హోస్ట్ చేయాల్సిందిగా తనను అడిగినప్పుడు.. ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి తాను ఎక్కవ సమయం తీసుకోలేదని చెప్పాడు జూనియర్. ఇదే సమయంలో జై లవకుశ చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తుండడాన్ని కూడా తాను ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు జూనియర్.
‘బిగ్ బాస్’ సీజన్ 2ను కూడా జూనియరే హోస్ట్ చేయబోతున్నాడు. ఈ విషయం ఇంతకుముందే హల్చల్ చేయగా, తాజాగా ఇది అధికారికమైంది. ఛాలెంజింగ్ గా తీసుకుని చేసిన ‘బిగ్ బాస్ తెలుగు’ బాగా ఎంజాయ్ చేసానని, ఇందుకు గానూ స్టార్ మా ఛానల్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఇక నుండి ‘నా టీవీ’ని మిస్ అవుతున్నానని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనిపై స్పందించిన ‘స్టార్ మా’… తారక్ కు థాంక్స్ చెప్తూ… బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కోసం కలుద్దామని, మళ్ళీ ఇరువురం కలిసి పని చేద్దామని స్పష్టత ఇచ్చింది.
ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనబోయే వారు కాస్త హాట్ చిక్స్ ఉండవచ్చని, ఆ రీత్యా ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారని, అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరిలో గానీ, వచ్చే ఏడాది మొదట్లో గానీ సీజన్ 2 ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.